బిషప్ నివాసంలోకి వెళ్తున్న యువకుడిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో.. మనస్తాపానికి గురైన యువకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు.
హైదరాబాద్:
బిషప్ నివాసంలోకి వెళ్తున్న యువకుడిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో.. మనస్తాపానికి గురైన యువకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ సంఘటన సికింద్రాబాద్‌లో శనివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న బిషప్ నివాసంలోకి వెళ్లేందుకు యత్నిస్తుండగా.. సెక్యూరిటీ గార్డు అతన్ని అడ్డుకున్నాడు.
దీంతో జీసెస్‌నినాదాలు చేస్తూ.. ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.