స్ట్రీట్ ఫైట్లో యువకుడు మృతి | youngster dies in street fight in hyderabad | Sakshi
Sakshi News home page

స్ట్రీట్ ఫైట్లో యువకుడు మృతి

Mar 6 2016 10:01 PM | Updated on Sep 3 2017 7:09 PM

పాతబస్తిలో స్ట్రీట్ ఫైట్ మరో యువకున్ని బలితీసుకుంది.

హైదరాబాద్: పాతబస్తిలో స్ట్రీట్ ఫైట్ మరో యువకున్ని బలితీసుకుంది. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ తరహాలో ఆదివారం జరిగిన స్ట్రీట్ ఫైట్ లో ఇర్ఫాన్ అనే యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన ఓల్డ్ సిటీలోని రెయిన్ బజార్లో చోటు చేసుకుంది. రెయిన్ బజార్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. ఇర్ఫాన్తో ఫైట్ చేసిన మరో వ్యక్తి పరారీలో ఉన్నట్టు సమాచారం. ప్రెండ్లీగా స్ట్రీట్ ఫైట్ చేశారా లేక బెట్టింగ్కు పాల్పడ్డారా అన్న విషయం తెలియాల్సి ఉంది. ఇర్ఫాన్ పెట్రోల్ బంక్లో పని చేసేవాడని స్థానికులు చెబుతున్నారు.

ఇదే తరహాలో నబిల్ అనే యువకుడు స్ట్రీట్ ఫైట్ చేస్తూ మృతి చెందిన విషయం తెలిసిందే. గత ఏడాదిలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వీడియో బయటకు రావడంతో అసలు విషయం బయటకు వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement