అత్తాపూర్‌లోని మారుతినగర్‌లో శుక్రవారం సాయంత్రం గాలి వానకు గోడ కూలిపోవడంతో కార్మికుడు మృతి చెందాడు.
అత్తాపూర్‌లోని మారుతినగర్‌లో శుక్రవారం సాయంత్రం గాలి వానకు గోడ కూలిపోవడంతో కార్మికుడు మృతి చెందాడు. నిర్మాణంలో ఉన్న భవనం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా వీచిన గాలులకు నిర్మాణంలో ఉన్న గోడ కుప్పకూలింది. శిధిలాలు కార్మికులపై పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఎల్లయ్య అనే కార్మికుడు మృతి చెందగా మరొక కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ కార్మికుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.