తెలంగాణలో పార్టీ కోసం పనిచేయండి! | work for party in Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో పార్టీ కోసం పనిచేయండి!

Aug 19 2014 1:43 AM | Updated on Jul 28 2018 6:33 PM

తెలంగాణలో పార్టీ కోసం పనిచేయండి! - Sakshi

తెలంగాణలో పార్టీ కోసం పనిచేయండి!

తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నేతలు రావుల చంద్రశేఖరరెడ్డి, వేంనరేందర్‌రెడ్డి జాతీయ స్థాయిలో పార్టీ కోసం పనిచేస్తారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నాయకులతో పేర్కొన్నారు.

రేవంత్‌రెడ్డికి చంద్రబాబు సూచన

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నేతలు రావుల చంద్రశేఖరరెడ్డి, వేం నరేందర్‌రెడ్డి జాతీయ స్థాయిలో పార్టీ కోసం పనిచేస్తారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నాయకులతో పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీలోని చంద్రబాబు చాంబర్‌లో పార్టీ నేతలు రావుల చంద్రశేఖరరెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు సమావేశమయ్యారు. అదే సమయంలో రేవంత్‌రెడ్డి అక్కడికి వచ్చారు.
 
ఆయన్ను చూసిన యనమల ఇక్కడ కూడా తెలంగాణ వారి పెత్తనమేనా అని సరదాగా వ్యాఖ్యానించారు. వెంటనే రేవంత్.. ‘ఇప్పటికే మా నేతలు ఇద్దరు మీ కోసం పనిచేస్తున్నారు.’ అని వ్యాఖ్యానించారు. ఈ సమయంలో చంద్రబాబు జోక్యం చేసుకుని.. ‘రావుల, వేం జాతీయ స్థాయిలో పార్టీ కోసం పనిచేస్తారు. మీరు తెలంగాణలో పార్టీ అభివృద్ధికి పనిచేయండి’ అని రేవంత్‌కు సూచించారు. పార్టీ ఆదేశిస్తే మెదక్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేం దుకు సిద్ధమని అసెంబ్లీ ఆవరణలో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement