రైలు ఢీకొని మహిళకు తీవ్ర గాయాలు | women injured in train accident | Sakshi
Sakshi News home page

రైలు ఢీకొని మహిళకు తీవ్ర గాయాలు

Mar 6 2017 11:48 AM | Updated on Sep 5 2017 5:21 AM

నగరంలోని నెక్లెస్‌ రోడ్డు రైల్వేస్టేషన్‌ సమీపంలో ఓ మహిళ పట్టాలు దాటుతుండగా వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టింది.

హైదరాబాద్‌:  నగరంలోని  నెక్లెస్‌ రోడ్డు రైల్వేస్టేషన్‌ సమీపంలో ఓ మహిళ పట్టాలు దాటుతుండగా వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టింది. దీంలో ఆమె  తీవ్రంగా గాయపడింది. ఈ ప్రమాదంలో ఆమె రెండు కాళ్లు కోల్పోయింది. ఈ సంఘటన ఆదివారం అర‍్థరాత్రి చోటు చేసుకుంది. నెక్లెస్‌ రోడ్డు రైల్వేస్టేషన్‌ సమీపంలో సువర‍్ణ అనే మహిళ రైలు పట్టాలు దాటుతుండగా ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఆ మహిళ రెండుకాళ్లు తెగిపడ్డాయి. బాధితురాలు అమీర్‌పేటలోని ఓ ఆస్పత్రిలో ఫార్మాసిస్ట్‌గా పనిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. రాజ్‌భవన్‌ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నట్లు తెలిసింది. తీవ్రంగా గాయపడ్డ ఆమెను మాజీ కార్పొరేటర్‌ షరీఫ్‌ సాయంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఆ మహిళ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement