అత్తింటి వేధింపులు తాళలేక... | Women commit suicide due to Domestic Violence | Sakshi
Sakshi News home page

అత్తింటి వేధింపులు తాళలేక...

Dec 16 2015 6:48 PM | Updated on Sep 4 2018 5:07 PM

అత్తింటి వేదింపులు తాళలేక ఓ మహిళ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది.

అత్తింటి వేదింపులు తాళలేక ఓ మహిళ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ సంఘటన నగరంలోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్‌నగర్‌లో బుధవారం సాయంత్రం వెలుగు చూసింది. స్థానిక కాలనీకి చెందిన స్వాతి(25)కి రెండేళ్ల క్రితం వివాహమైంది. అప్పటినుంచి అత్తింటి వారు వేధిస్తుండటంతో.. మనస్తాపానికి గురైన స్వాతి ఈ రోజు ఇంట్లో ఎవురు లేని సమయంలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.



 

Advertisement
 
Advertisement
Advertisement