'బాగా చదువుకో'.. కన్నీరు పెట్టిస్తున్న విషాదం | Mother Son Incident in Venkatagiri | Sakshi
Sakshi News home page

'బాగా చదువుకో'.. కన్నీరు పెట్టిస్తున్న విషాదం

Jul 8 2026 11:55 AM | Updated on Jul 8 2026 12:18 PM

Mother Son Incident in Venkatagiri

‘తమ్ముడిని తీసుకుని మార్టుకెళ్తున్నా. అక్కడ వాడికి బొమ్మలు కొనిస్తా. నీకు కూడా తెస్తాలే..!!. నువ్వు స్కూలు నుంచి జాగ్రత్తగా ఇంటికి వెళ్లు. బాగా చదువుకోవాలి. డబ్బులు, నగలు భద్రం..’ అంటూ తల్లి లీలా బాలశ్రావణి కుమార్తెతో మాట్లాడిన చివరి మాటలు గుర్తుచేసుకుని బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. సోమవారం కుమారుడిపై పెట్రోల్‌ పోసి తనూ నిప్పంటించుకుని మృత్యుఒడికి చేరిన ఘటనపై వెంకటగిరి పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపడుతున్నారు. ఎందుకు చనిపోయింది.. ఆ ఆలోచన ఎలా వచ్చింది.. దీనికి కారణమేమిటి..? అన్న కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. కాగా.. మంగళవారం తల్లీకుమారుడికి బంధుమిత్రుల సమక్షంలో బరువెక్కిన హృదయాలతో వీడ్కోలు పలికారు.  

వెంకటగిరి రూరల్‌: వెంకటగిరి పట్టణానికి చెందిన లీలా బాలశ్రావణి, ఆమె కుమారుడు చంద్రమౌళి ఆత్మహత్యపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. స్థానికుల వివరాల మేరకు.. ఇంట్లో భర్త నిద్రపోతున్న వేళ పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన కుమారుడు చంద్రమౌళిని తన మోటారు సైకిల్‌పై ఎక్కించుకోని పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న కుమార్తె నిషిత వద్దకు లాలా బాలశ్రావణి వెళ్లింది. కుమార్తెను పంపించాలని పాఠశాల ఉపా«ధ్యాయులను అభ్యరి్థంచింది. ఆ సమయంలో నిషితకు పరీక్ష ఉండడంతో పంపడం వీలుకాదని ఉపాధ్యాయులు తేల్చారు. దీంతో లీలా బాలశ్రావణి వంటిపై ఉన్న బంగారు ఆభరణాలు, నగదు పాఠశాల వద్ద కుమార్తెకు ఇచ్చి జాగ్రత్తగా ఇంటికి వెళ్లి, బాగా చదువుకోమని చెప్పినట్టు సమాచారం. తమ్ముడిని మార్టుకి తీసుకెళ్లి బొమ్మలు తీసుకొని వస్తామమని చెప్పి పట్టణంలోని కాశితోట వద్దకు చేరుకుంది. తనతోపాటు కుమారుడిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించుకుని తనువు చాలించింది. ఆ సమయంలో నిషతను తల్లితో పంపి ఉంటే నిషిత కుడా ప్రమాదానికి గురయ్యేదని స్థానికులు చర్చించుకుంటున్నారు.  

కన్నీటి వీడ్కోలు 
పోస్టుమార్టం అనంతరం తల్లీకుమారుడి మృతదేహాలను స్వగృహం అయిన డక్కిలి మండలం, వెంబులూరు గ్రామానికి తీసుకెళ్లారు. ఒకే చోట తల్లి, కుమారుడు మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులతోపాటు, స్థానికులు చలించిపోయారు. వెంకటగిరి పట్టణం నుంచి పలువురు స్వగ్రామానికి చేరుకుని నివాళి అర్పించారు. కన్నీటి వీడ్కోలు మధ్య తల్లి, కుమారుడి అంత్యక్రియలు పూర్తి చేశారు.

చిన్న మనస్పర్థలే కారణమా? 
పెళ్లి జరిగి 12 ఏళ్లు దాటింది. ఉమ్మడి కుటుంబంతో అందరూ కలసిమెలసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. లీలా బాలశ్రావణికి చాలా మృధుస్వభావి. ప్రతి చిన్న విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచింతే తత్వం ఉన్నట్లు సమాచారం. గత కొన్నేళ్లుగా తలనొప్పితో బాధ పడుతుండేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ మేరకు ఎక్కువగా ఆలోచించి క్షణికావేశం, తొందరపాటు నిర్ణయం తీసుకుందని పోలీసులకు తెలిపారు. అయితే భార్త నాగేశ్వరశర్మకు, భార్య లీలా బాలశ్రావణికి ముడు రోజుల నుంచి చిన్నపాటి మనస్పర్థలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు.  

ముమ్మర దర్యాప్తు  
తల్లి, కుమారుడు అగ్నికి ఆహుతైన ఘటనపై వెంకటగిరి సీఐ రోశయ్య, ఎస్‌ఐ స్వరూప ముమ్మర దర్యాప్తు చేపడుతున్నారు. మంగళవారం ప్రభుత్వ వైద్యశాలకు చేరుకుని ప్రమాదానికి గల కారణాలను భర్త నాగేశ్వరశర్మ, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. సమాచారం అందుకున్న నాయుడుపేట ఫోరెన్సిక్‌ టీమ్‌ ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. కుటుంబ సభ్యులు అందించిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ రోశయ్య తెలియజేశారు. తల్లి బాలశ్రావణి, కుమారుడు చంద్రమౌళి మృతదేహాలకు పోస్టుమర్టం పూర్తిచేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement