కావూరి హిల్స్‌ వద్ద కారు బీభత్సం, యువతి పరారీ | woman rash driving, hist tata safari near kavuri hills in hyderabad | Sakshi
Sakshi News home page

కావూరి హిల్స్‌ వద్ద కారు బీభత్సం, యువతి పరారీ

May 13 2017 10:17 AM | Updated on Aug 30 2018 4:10 PM

కావూరి హిల్స్‌ వద్ద కారు బీభత్సం, యువతి పరారీ - Sakshi

కావూరి హిల్స్‌ వద్ద కారు బీభత్సం, యువతి పరారీ

ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్‌ రోడ్డు ప్రమాద ఘటన మరవక ముందే కావూరి హిల్స్‌ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది.

హైదరాబాద్‌ : ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్‌ రోడ్డు ప్రమాద ఘటన మరవక ముందే కావూరి హిల్స్‌ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో రాంగ్‌ టూర్‌లో వచ్చిన  ఓ యువతి  తన మినీ కూపర్‌ కారును వెనుక నుంచి ఓ  టాటా సఫారీని వేగంగా ఢీకొట్టింది. అయితే ఆ సమయానికి ఎయిర్‌ బ్యాగ్‌లు తెరుచుకోవడంతో కారులో ప్రయాణిస్తున్న యువతికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. 

ఈ రోజు తెల్లవారుజామున 4.30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది.  ఆ యువతి బర్త్‌డే పార్టీలో పాల్గొని తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదం జరిగిన తర్వాత ఆ యువతి కారు వదలి అక్కడ నుంచి అదృశ్యమైంది. జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతి ఆచూకీ కోసం సీసీ టీవీ ఫుటేజ్‌ ద్వారా విచారణ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement