పాసింజర్ రైలులో మహిళ మృతదేహం | woman dead body found in passenger train | Sakshi
Sakshi News home page

పాసింజర్ రైలులో మహిళ మృతదేహం

Jan 24 2016 11:16 AM | Updated on Sep 4 2018 5:07 PM

గుంటూరు- కాచిగూడ పాసింజర్ రైలులో ఓ గుర్తు తెలియని మహిళ మృత దేహం వెలుగు చూసింది.

గుంటూరు- కాచిగూడ పాసింజర్ రైలులో ఓ గుర్తు తెలియని మహిళ మృత దేహం వెలుగు చూసింది. మహిళను దారుణంగా హత్య చేసిన దుండగులు గోనెసంచిలో కుక్కి రైలు బాత్‌రూమ్‌లో వదిలేసి వెళ్లినట్టు తెలుస్తోంది. శనివారం అర్ధరాత్రి కాచిగూడ చేరుకున్న రైలులో ప్రయాణికులు దిగిపోయిన తర్వాత సిబ్బంది తనిఖీ చేయగా మృతదేహం బయటపడింది. రైల్వే పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.



 

Advertisement
 
Advertisement
Advertisement