విశాఖ ఎక్స్‌ప్రెస్‌ అత్యాచార కేసులో ట్విస్ట్‌ | Shocking Twist Revealed In Visakha Express Train Woman Rape Case, AC Coach Worker Identified As Accused | Sakshi
Sakshi News home page

విశాఖ ఎక్స్‌ప్రెస్‌ అత్యాచార కేసులో ట్విస్ట్‌

Apr 30 2026 8:53 AM | Updated on Apr 30 2026 9:35 AM

New Twist In Visakha Express Train Woman Rape Case

సాక్షి, పల్నాడు: వివాహితకు మాయమాటలు చెప్పి ఏసీ బోగీలోకి లాక్కెళ్లి మరీ అత్యాచారం జరిపిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిత్యం ప్రయాణికులతో కిక్కిరిసి ఉండే విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో అదెలా సాధ్యమైందంటూ అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే.. రైల్వే పోలీసులు ఎట్టకేలకు ఈ కేసును చేధించారు. 

విశాఖ ఎక్స్‌ప్రెస్‌ వివాహిత అత్యాచార కేసులో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. నిందితుడు ఏసీ బోగీలో పని చేసే కార్మికుడేనని తేలింది. ఒడిశాకు చెందిన శౌరవ్‌ బగ్దీ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని.. అతన్ని అరెస్ట్‌ చేశామని విజయవాడ రైల్వే పోలీసులు ప్రకటించారు. తాను స్టాఫ్‌నని చెప్పి ఆ జంటను వెంట తీసుకెళ్లాడని, వాళ్ల ఆర్థిక స్థితి చెప్పడంతో డబ్బులు కూడా వద్దన్నాడని.. ఆపై ఏమార్చి వివాహితను ఏసీ బోగీలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని పోలీసులు వెల్లడించారు.

పల్నాడు జిల్లా రెంటచింతలకు చెందిన భార్యభర్తలు జీవనోపాధి కోసం విశాఖకు వెళ్లారు. జెట్టిపాలెం(పల్నాడు)లో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు విశాఖ ఎక్స్‌ప్రెస్‌ జనరల్‌ బోగీ ఎక్కారు. కాసేపటి తర్వాత ఓ వ్యక్తి వాళ్ల దగ్గరకు వచ్చాడు. ఏసీ బోగీలో సీట్లు ఉన్నాయని.. తన వెంట రావాలని తీసుకెళ్లాడు. తీరా అక్కడికి వెళ్లాక ఒక సీటే ఖాళీగా ఉందని చెప్పడంతో భార్యను పంపించి తాను టాయ్‌లెట్‌ వద్ద కూర్చోనిపోయాడు ఆ భర్త. 

అయితే ఇదే అదనుగా ఆ మహిళను హెచ్‌1ఏ బోగీలోకి లాక్కెల్లి.. కూపే తలుపు మూసి దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటన తర్వాత నిందితుడు పారిపోగా.. భార్యభర్తలిద్దరూ రెంటచింతల పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు.. ఘటనపై విజయవాడ రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో దర్యాప్తు వేగవంతం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement