గంజాయి స్వాధీనం.. మహిళ అరెస్టు | Woman arrested for possessing marijuana | Sakshi
Sakshi News home page

గంజాయి స్వాధీనం.. మహిళ అరెస్టు

Mar 3 2017 9:39 PM | Updated on Oct 9 2018 2:23 PM

హైదరాబాద్‌లోని బాలానగర్‌ ఎక్సైజ్‌ ప్రొహిబిషన్‌ ఆధ్వర్యంలో ఫతేనగర్‌ పిట్టల బస్తీ బస్‌స్టాప్‌లో గంజాయి అమ్ముతున్న స్వరూప (32) అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు.

బాలానగర్‌:‌ హైదరాబాద్‌లోని బాలానగర్‌ ఎక్సైజ్‌ ప్రొహిబిషన్‌ ఆధ్వర్యంలో ఫతేనగర్‌ పిట్టల బస్తీ బస్‌స్టాప్‌లో గంజాయి అమ్ముతున్న స్వరూప (32) అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె కొద్ది కాలంగా గంజాయిని అమ్ముతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం అందటంతో పోలీసులు మాటు వేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సోదాలు చేయగా ఆమె నుంచి 2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఆ మహిళను రిమాండ్‌కు తరలించారు. కార్యక్రమంలో ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇంద్రసేనారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.  
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement