మంత్రి చెప్పడం వల్లే వాకౌట్: జీవన్ రెడ్డి | we walkout on comments of harish Rao, says JeevanReddy | Sakshi
Sakshi News home page

మంత్రి చెప్పడం వల్లే వాకౌట్: జీవన్ రెడ్డి

Mar 27 2016 3:37 PM | Updated on Sep 3 2017 8:41 PM

మంత్రి చెప్పడం వల్లే వాకౌట్: జీవన్ రెడ్డి

మంత్రి చెప్పడం వల్లే వాకౌట్: జీవన్ రెడ్డి

పోలీసుల వైఫల్యం వల్లే వీణవంక ఘటన జరిగిందని కాంగ్రెస్ సీనీయర్ నేత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండిపడ్డారు.

హైదరాబాద్: పోలీసుల వైఫల్యం వల్లే వీణవంక ఘటన జరిగిందని కాంగ్రెస్ సీనీయర్ నేత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలలో వీణవంక ఘటనపై ఆయన మాట్లాడారు. బాధితురాలు ఫిర్యాదుచేసినా పోలీసులు స్పందించలేదని గుర్తచేశారు. నిందితుల్లో ఒకరిని మైనర్ గా చూపడం, కేసును పోలీసులు నీరు గారుస్తున్నారనడానికి నిదర్శనమని తెలుస్తోందని వ్యాఖ్యానించారు.

నిందితులకు పోలీసులు అండగా నిలుస్తున్నారని, సభలో మంత్రి చేసిన ప్రకటనలో స్పష్టమైందన్నారు. మంత్రి ప్రకటనపై వివరణ అడగటానికి వీల్లేదని మరో మంత్రి హరీష్ రావు చెప్పడం వల్లే తమ పార్టీ నేతలు వాకౌట్ చేశామని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. పోలీస్ ట్రెయినింగ్ శిక్షణకు వెళ్తున్న దళిత యువతిపై తోటి విద్యార్థులు గ్యాంగ్ రేప్ చేసిన ఘటన కొంతకాలం కిందట సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement