breaking news
veenavanka incident
-
మంత్రి చెప్పడం వల్లే వాకౌట్: జీవన్ రెడ్డి
హైదరాబాద్: పోలీసుల వైఫల్యం వల్లే వీణవంక ఘటన జరిగిందని కాంగ్రెస్ సీనీయర్ నేత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలలో వీణవంక ఘటనపై ఆయన మాట్లాడారు. బాధితురాలు ఫిర్యాదుచేసినా పోలీసులు స్పందించలేదని గుర్తచేశారు. నిందితుల్లో ఒకరిని మైనర్ గా చూపడం, కేసును పోలీసులు నీరు గారుస్తున్నారనడానికి నిదర్శనమని తెలుస్తోందని వ్యాఖ్యానించారు. నిందితులకు పోలీసులు అండగా నిలుస్తున్నారని, సభలో మంత్రి చేసిన ప్రకటనలో స్పష్టమైందన్నారు. మంత్రి ప్రకటనపై వివరణ అడగటానికి వీల్లేదని మరో మంత్రి హరీష్ రావు చెప్పడం వల్లే తమ పార్టీ నేతలు వాకౌట్ చేశామని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. పోలీస్ ట్రెయినింగ్ శిక్షణకు వెళ్తున్న దళిత యువతిపై తోటి విద్యార్థులు గ్యాంగ్ రేప్ చేసిన ఘటన కొంతకాలం కిందట సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. -
హోం మంత్రి రాజీనామా చేయాలి: శ్రవణ్
సాక్షి, హైదరాబాద్: మహిళలకు భద్రత కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ విమర్శించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కరీంనగర్ జిల్లా వీణవంక ఘటనకు నైతిక బాధ్యత వహించి రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని ఈ కాంగ్రెస్ నేత డిమాండ్ చేశారు.