యాంకర్‌ ప్రదీప్‌కు అడిషనల్‌ డీసీపీ హెచ్చరిక | warning to pradeep | Sakshi
Sakshi News home page

యాంకర్‌ ప్రదీప్‌కు అడిషనల్‌ డీసీపీ హెచ్చరిక

Jan 5 2018 2:12 PM | Updated on May 25 2018 2:06 PM

warning to pradeep - Sakshi

హైదరాబాద్‌ :  ఒక వేళ గడువు లోపు టీవీ యాంకర్‌ ప్రదీప్ కౌన్సెలింగ్‌కు హాజరుకాకపోతే కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని అడిషనల్‌ డీసీపీ అమరకాంత్‌ రెడ్డి హెచ్చరించారు. విలేకరులతో మాట్లాడుతూ..కోర్టు అనుమతితో వారెంట్ జారీ చేసి అరెస్ట్ చేస్తామని తెలిపారు. ప్రదీప్ షూటింగ్‌లో బిజీగా ఉండడం వల్ల రాలేక పోయాను అని ఓ వీడియో చూశామని చెప్పారు. ప్రదీప్‌ వచ్చిన తరువాత రెండు గంటల పాటు తల్లిదండ్రులు సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వయిస్తామని అన్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది డ్రంక్ డ్రైవ్ కేసులు తగ్గాయని వెల్లడించారు. జైలుకి వెళ్లిన వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గిందని, కౌన్సెలింగ్‌కు హాజరయ్యే ప్రక్రియలో వీఐపీలకే కాదు, సామాన్యులకు కూడా గడువు ఇస్తామని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement