పటేల్ ఉద్యమం ఆర్‌ఎస్‌ఎస్ కుట్ర : వీహెచ్ | vh fires on rss and hardik patel | Sakshi
Sakshi News home page

పటేల్ ఉద్యమం ఆర్‌ఎస్‌ఎస్ కుట్ర : వీహెచ్

Sep 5 2015 9:26 PM | Updated on Sep 3 2017 8:48 AM

పటేల్ ఉద్యమం ఆర్‌ఎస్‌ఎస్ కుట్ర : వీహెచ్

పటేల్ ఉద్యమం ఆర్‌ఎస్‌ఎస్ కుట్ర : వీహెచ్

గుజరాత్‌లో జరుగుతున్న పటేల్ ఉద్యమం ఆర్‌ఎస్‌ఎస్ కుట్ర అని రాజ్యసభసభ్యుడు వి.హనుమంతరావు ఆరోపించారు.

హైదరాబాద్: గుజరాత్‌లో జరుగుతున్న పటేల్ ఉద్యమం ఆర్‌ఎస్‌ఎస్ కుట్ర అని రాజ్యసభసభ్యుడు వి.హనుమంతరావు ఆరోపించారు. అసెంబ్లీ ఆవరణలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బీసీలకు, ఓబీసీలకు రిజర్వేషన్లు లేకుండా చేయాలని ఆర్‌ఎస్‌ఎస్ కుట్ర చేస్తోందన్నారు. గుజరాత్‌లో సంపన్నమైన పటేల్ కులాన్ని బీసీల్లో కలిపితే అంగీకరించబోమని తెలిపారు. ఇలాంటి కుట్రలతో దేశవ్యాప్తంగా అశాంతిని సృష్టించే ఆర్‌ఎస్‌ఎస్ కుట్రలను మానుకోకుంటే తగిన బుద్ధి చెబుతామని వీహెచ్ ఈ సందర్భంగా హెచ్చరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement