ఖైరతాబాద్ వినాయకుడిని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆదివారం దర్శించుకున్నారు.
నగరంలోని ఖైరతాబాద్ వినాయకుడిని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు ఆదివారం దర్శించుకున్నారు. మండప నిర్వాహకులు మంత్రులకు స్వాగత ఏర్పాట్లు చేశారు. ఏక దంతుని దర్శించుకున్న అనంతరం నిర్వాహకులు మంత్రులకు గణనాథుని తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మండప నిర్వాహకులు మంత్రులను శాలువాలు కప్పి సత్కరించారు.