'దోచుకున్న సొమ్ము ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారు' | Uttam kumar reddy slams TRS govt | Sakshi
Sakshi News home page

'దోచుకున్న సొమ్ము ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారు'

Jan 9 2016 4:15 PM | Updated on Sep 19 2019 8:44 PM

'దోచుకున్న సొమ్ము ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారు' - Sakshi

'దోచుకున్న సొమ్ము ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారు'

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సోషల్‌ మీడియా ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి ఎండగట్టాలని తెలంగాణ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సోషల్‌ మీడియా ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి ఎండగట్టాలని తెలంగాణ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం గాంధీభవన్‌లో తెలంగాణ ఎన్‌ఎస్‌యూఐ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులను మోసం చేశాయని ధ్వజమెత్తారు.

ఫీజూ రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని బలహీనపర్చడం వల్ల తెలంగాణలో కాలేజీలు మూతపడుతున్నాయని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవినీతిమయైందని అన్నారు. టీఆర్‌ఎస్‌ నేతలు దోచుకున్న సొమ్ము ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారని ఉత్తమ్‌ ఆరోపించారు. సీమంధ్రులను దుషించిన టీఆర్‌ఎస్‌ నేతలే.. ఇప్పుడు వారి ఓట్ల కోసం పాకులాడుతున్నారని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ధ్వజమెత్తారు.
 

Advertisement
 
Advertisement
Advertisement