రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు | Two serious injuries in a road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

Oct 4 2015 8:39 PM | Updated on Sep 4 2018 5:16 PM

వేగంగా దూసుకువచ్చిన కారు ఎదురుగా వచ్చిన బైక్‌ను ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

వేగంగా దూసుకువచ్చిన కారు ఎదురుగా వచ్చిన బైక్‌ను ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ మండలం డీ పోచంపల్లి సాయిపూజ కాలనీకి బానోతు తుల్జా, సికిందర్‌లు కూలి పనులు చేస్తు జీవనం సాగిస్తున్నారు.

ఆదివారం మధ్యాహ్నం వీరు బైక్‌పై సాయి పూజ కాలనీకి వెళ్తుండగా దుండిగల్ పోలీస్‌స్టేషన్ ఎదురుగా మేడ్చల్ నుంచి వస్తున్న ఇన్నోవా కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తుల్జా, సికిందర్‌లకు తీవ్ర గాయాలు కాగా వారిని వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

ఇన్నోవా కారు నడుపుతున్న వ్యక్తి పరారు కాగా... కారులో బీరు సీసాలు లభ్యమయ్యాయి. ఈ మేరకు దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement