మీ నాన్న రమ్మంటున్నాడని కిడ్నాప్ | two school student kidnapped in Vanasthalipuram | Sakshi
Sakshi News home page

మీ నాన్న రమ్మంటున్నాడని కిడ్నాప్

Aug 4 2014 10:35 AM | Updated on Nov 9 2018 4:44 PM

హైదరాబాద్ వనస్థలిపురం సాహెబ్ నగర్ ప్రభుత్వ పాఠశాల సమీపంలో సోమవారం ఇద్దరు విద్యార్థులు అపహరణకు గురయ్యారు.

హైదరాబాద్ : హైదరాబాద్ వనస్థలిపురం సాహెబ్ నగర్ ప్రభుత్వ పాఠశాల సమీపంలో సోమవారం ఇద్దరు విద్యార్థులు అపహరణకు గురయ్యారు. కిడ్నాప్ అయిన చిన్నారులు దుర్గా భవానీ (8), అరవింద్‌ (7)గా గుర్తించారు. ఈరోజు ఉదయం స్కూల్ సమీపంలో ఓ గుర్తు తెలియని మహిళ వచ్చి మీ నాన్న రమ్మంటున్నాడంటూ ఇద్దరు చిన్నారులను తనతో తీసుకు వెళ్లినట్లు సహ విద్యార్థులు తెలిపారు.

 

స్కూల్ యాజమాన్యం, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు  రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. కాగా కిడ్నాప్ అయిన చిన్నారుల తల్లిదండ్రులు పొట్టకూటి కోసం రాజమండ్రి నుంచి నగరానికి వలస వచ్చినట్లు సమాచారం. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement