breaking news
enquirty
-
అదృశ్యమైన చిన్నారుల ఆచూకీ లభ్యం
హైదరాబాద్ : వనస్థలిపురం సాహెబ్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో అదృశ్యమైన గురైన చిన్నారుల ఆచూకీ లభ్యమైంది. చిన్నారులను కిడ్నాప్ చేసిన మహిళ ....వాళ్ల మెడలో గొలుసు, చెవి పోగులు తీసుకుని పాఠశాలకు రెండు కిలోమీటర్ల దూరంలో వదిలి వెళ్లినట్లు సమాచారం. వీరిద్దర్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సోమవారం ఉదయం స్కూల్కు వెళుతున్న విద్యార్థులను గుర్తు తెలియని మహిళ అపహరించుకు వెళ్లిన విషయం తెలిసిందే. కాగా తమ చిన్నారులు క్షేమంగా తిరిగి రావటంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. -
మీ నాన్న రమ్మంటున్నాడని కిడ్నాప్
హైదరాబాద్ : హైదరాబాద్ వనస్థలిపురం సాహెబ్ నగర్ ప్రభుత్వ పాఠశాల సమీపంలో సోమవారం ఇద్దరు విద్యార్థులు అపహరణకు గురయ్యారు. కిడ్నాప్ అయిన చిన్నారులు దుర్గా భవానీ (8), అరవింద్ (7)గా గుర్తించారు. ఈరోజు ఉదయం స్కూల్ సమీపంలో ఓ గుర్తు తెలియని మహిళ వచ్చి మీ నాన్న రమ్మంటున్నాడంటూ ఇద్దరు చిన్నారులను తనతో తీసుకు వెళ్లినట్లు సహ విద్యార్థులు తెలిపారు. స్కూల్ యాజమాన్యం, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. కాగా కిడ్నాప్ అయిన చిన్నారుల తల్లిదండ్రులు పొట్టకూటి కోసం రాజమండ్రి నుంచి నగరానికి వలస వచ్చినట్లు సమాచారం. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.