టీఎస్‌పీఈసెట్‌ ఫలితాలు విడుదల | TSPECET results to be announced soon | Sakshi
Sakshi News home page

టీఎస్‌పీఈసెట్‌ ఫలితాలు విడుదల

Jul 1 2017 3:16 AM | Updated on Sep 5 2017 2:52 PM

తెలంగాణలో వ్యాయామ విద్యా కోర్సుల ప్రవేశానికి నిర్వహించిన టీఎస్‌పీఈసెట్‌–2017 ఫలితాలు విడుదలయ్యాయి.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో వ్యాయామ విద్యా కోర్సుల ప్రవేశానికి నిర్వహించిన టీఎస్‌పీఈసెట్‌–2017 ఫలితాలు విడుదలయ్యాయి. బీపీఈడీ, డీపీఈడీ కోర్సుకు సంబంధించి ప్రవేశ పరీక్ష ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి శుక్రవారం విడుదల చేశారు. బీపీఈడీ, డీపీఈడీ కేటగిరీలో మొత్తం 5,653 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా 5,502 (97.99%) మంది ఉత్తీర్ణులయ్యారు. 

బీపీఈడీ కేటగిరీలో 2,865 మందికి 2776 (97.65%) మంది, డీపీఈడీ కేటగిరీలో 2,788 మందికి 2,726  (98.37%)మంది ఉత్తీర్ణత సాధించారు. బీపీఈడీలో తొలి ర్యాంకు రాళ్ల నవత (వనపర్తి), రెండో ర్యాంకు అశ్విని (వరంగల్‌), మూడో ర్యాంకు శ్రీను (చర్ల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా) సాధించారు. డీపీఈడీలో కేటగిరీలో తొలి ర్యాంకు రజిత (జయశంకర్‌ భూపా లపల్లి జిల్లా), రెండో ర్యాంకు సంధ్య (నల్లగొండ), మూడో ర్యాంకు అనూష (ఆత్మకూరు, వనపర్తి జిల్లా) సాధించారు.

Advertisement
 
Advertisement
Advertisement