ఒప్పందం చరిత్రాత్మకం: హరీష్ | TS & Maharashtra Govt To Sign Historic Agreements, says harish rao | Sakshi
Sakshi News home page

ఒప్పందం చరిత్రాత్మకం: హరీష్

Aug 23 2016 6:24 PM | Updated on Sep 4 2017 10:33 AM

ఒప్పందం చరిత్రాత్మకం: హరీష్

ఒప్పందం చరిత్రాత్మకం: హరీష్

మూడు ప్రాజెక్టుల కోసం ఒకే రోజు ఒప్పందం జరగడం చరిత్రాత్మకమని తెలంగాణ మంత్రి హరీష్‌రావు తెలిపారు.

నీటి పారుదల శాఖా మంత్రి హరీష్‌రావు ప్రకటన
ఇది కేసీఆర్ రచించిన మరో చరిత్ర అని కితాబు



హైదరాబాద్: అంత రాష్ట్ర వివాదాల నడుమ నాలుగు దశాభ్ధాలుగా నలుగుతున్న మూడు ప్రాజెక్టుల కోసం ఒకే రోజు ఒప్పందం జరగడం చరిత్రాత్మకమని తెలంగాణ భారీ నీటి పారుదల శాఖా మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ రచించిన మరోచరిత్ర అని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.  

ఇలాంటి చారిత్రక ఘట్టంలో తానూ భాగస్వామి అయినందుకు తన జన్మధన్యమైందని హరీష్ రావు పేర్కొన్నారు. ముంబాయిలో జరిగిన ఒప్పందం వల్ల ఉత్తర తెలంగాణ తాగు, సాగు నీటి సమస్య తొలిగిపోతుందని... అలాగే మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలోని ఎత్తిపోతల పథకాల అవసరాలకు సాగునీరందుతుందని ఆయన చెప్పారు.

ఛరాఖా-కొరట, తమ్మిడిహెట్టి, మేడిగడ్డ ప్రాజెక్టులు పూర్తయితే రెండు రాష్ట్రాలలో మత్య్స పరిశ్రమ అభివృధ్ధి చెందుతుందన్నారు. నౌకాయానానికి సైతం అవకాశాలు మెరుగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సాగునీటి ప్రాజెక్టులపై ఒప్పందం ఫలించడానికి సహకరించిన మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, ఆ రాష్ట్ర ముంత్రులు గిరీశ్ మహజన్, విజయ శివతారే, మునగం తివార్, అంబరీష్‌రావు ఆత్రం తదితరులతోపాటు రెండు రాష్ట్రాల సాగునీటి రంగంనికి చెందిన ఇంజనీర్లు, అధికారులు, సిబ్బందికి ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలను నివారించడంతోపాటు ఆకుపచ్చ తెలంగాణ నిర్మాణానికిగానూ ప్రాజెక్టులను రీఇంజనీరింగ్ రూపొందించిన విజనరీ సీఎం కేసీఆర్‌కు మంత్రి హరీష్‌రావు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement