మోడ్రన్ టచ్... ట్రెడిషనల్ లుక్ | Traditional look with modern touch | Sakshi
Sakshi News home page

మోడ్రన్ టచ్... ట్రెడిషనల్ లుక్

Nov 11 2014 11:36 PM | Updated on Apr 3 2019 6:23 PM

మోడ్రన్ టచ్... ట్రెడిషనల్ లుక్ - Sakshi

మోడ్రన్ టచ్... ట్రెడిషనల్ లుక్

బాలీవుడ్ ఫ్యాషన్ బాద్‌షా మనీష్ మల్‌హోత్రా సిటీలో మహిళలకు లేటెస్ట్ ట్రెండ్స్‌పై మెళకువలు నేర్పాడు.

బాలీవుడ్ ఫ్యాషన్ బాద్‌షా మనీష్ మల్‌హోత్రా సిటీలో మహిళలకు లేటెస్ట్ ట్రెండ్స్‌పై మెళకువలు నేర్పాడు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ సోమాజిగూడ హోటల్ పార్క్ హయత్‌లో ‘ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇన్ సిటీ ఆన్ చేంజింగ్ ఫాకేడ్ ఆఫ్ ఫ్యాషన్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా’ అంశంపై ప్రసంగించాడు.  ‘ఎంతో మంది బాలీవుడ్ తారల డ్రెస్‌లు రూపొందించా. మైకేల్ జాక్సన్ భారత్ వచ్చినప్పుడు కూడా అతని డ్రెస్ డిజైన్ చేశా. ప్రతి ఒక్కరూ అందమైన వారే. మనల్ని మనం ఇంకాస్త అందంగా తీర్చిదిద్దుకోవడంలోనే ఆనందం ఉంటుంది.

25 ఏళ్ల నుంచి ఇదే రంగంలో ఉన్నా. దాదాపు 1,000 సినిమాలకు కాస్టూమ్స్ డిజైన్ చేశా. ఇకపై సినిమాలకు తగ్గించి, సామాన్యుల కోసం డిజైన్ చేస్తా. మోడ్రన్ టచ్‌తో ట్రెడిషనల్ లుక్ మిస్సవ్వకుండా డిజైన్ చేస్తే ఏ డ్రెస్ అయినా అద్భుతంగా ఉంటుంది. నగరంలోని ఆడవారు ఫ్యాషన్‌పై మక్కువ చూపుతున్నారు. ఇది శుభపరిణామం’ అంటూ ‘సిటీ ప్లస్’తో తన అనుభవాలు పంచుకున్నాడు మనీష్.     - సిరి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement