డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ సినీ దర్శకుడు | Tollywood director amma rajashekar caught in drunk and drive | Sakshi
Sakshi News home page

డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ సినీ దర్శకుడు

Mar 14 2015 8:24 AM | Updated on May 25 2018 2:06 PM

డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ సినీ దర్శకుడు - Sakshi

డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ సినీ దర్శకుడు

మరో సినీ ప్రముఖుడు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డాడు. నృత్య,సినీ దర్శకుడు అమ్మ రాజశేఖర్ తాగి డ్రైవ్ చేస్తూ హైదరాబాద్ పోలీసులకు దొరికిపోయారు.

హైదరాబాద్ : మరో సినీ ప్రముఖుడు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డాడు. నృత్య,సినీ దర్శకుడు  అమ్మ రాజశేఖర్ తాగి  డ్రైవ్ చేస్తూ హైదరాబాద్ పోలీసులకు దొరికిపోయారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద శనివారం అర్థరాత్రి పోలీసులు డ్రంక్‌ అండ్ డ్రైవ్ చేపట్టారు. ఈ తనిఖీల్లో డైరెక్టర్ అమ్మరాజశేఖర్‌ మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు.

మాదాపూర్‌ నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు మీదుగా బంజారాహిల్స్‌ వెళ్తున్న ఆయనను బ్రీత్‌ ఎనలైజర్‌తో పరీక్షించగా మద్యం తాగినట్లు తేలింది. రాజశేఖర్‌ వాహనం నడుపుతున్న సమయంలో ఆయన కుటుంబ సభ్యులు కూడా వాహనంలోనే ఉండడం గమనార్హం. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు వాహనాన్ని సీజ్ చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement