గుంటూరులో నేడు వైఎస్ జగన్ రెండోరోజు రైతుదీక్ష కొనసాగుతోంది
	వైఎస్ జగన్ రైతుదీక్ష
	గుంటూరులో నేడు వైఎస్ జగన్ రెండోరోజు రైతుదీక్ష కొనసాగుతోంది. రైతులపై సర్కారు నిర్లక్ష్య వైఖరికి నిరసనగా రెండు రోజుల దీక్ష చేపట్టిన వైఎస్ జగన్.. చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు. మద్దతు ధరపై చంద్రబాబు ప్రధానికి ఒక్క లేఖైనా రాశారా అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు హామీలు.. తర్వాత మోసాలని విమర్శించారు. నేడు సాయంత్రం దీక్ష విరమించనున్నారు.
	
	పోలవరానికి పర్యావరణ కమిటీ
	అమరావతి: పర్యావరణ పర్యవేక్షణ కమిటీ నేడు పోలవరానికి రానుంది. నేటి నుంచి మూడు రోజుల పర్యటించనున్న కమిటీ.. గురువారం విజయవాడలో అధికారులతో సమావేశం కానుంది.
	
	నరసింహన్ కొనసాగింపు!
	గవర్నర్ నరసింహన్ పదవవీకాలం నేటితో ముగియనుంది. ఆయన పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరికొంతకాలం కొనసాగించే అవకాశాలున్నాయి. సోమవారం ఉదయం గవర్నర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు.
	
	ముంపు మండలాల్లో ఎన్నికలు
	అమరావతి: పోలవరం ముంపు మండలాల్లో ఎన్నికలకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. రెండు జడ్పీటీసీ, 17 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్. ఈ నెల 5 నుంచి నామినేషన్ల స్వీకరణ, 21న పోలింగ్.
	
	గ్రీన్ ట్రిబ్యునల్‌లో విచారణ
	పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై నేడు గ్రీన్ ట్రిబ్యునల్‌లో విచారణ.
	
	ఐసెట్ ఎగ్జామ్
	అమరావతి: నేడు ఏపీ ఐసెట్ పరీక్ష. రాష్ట్రవ్యాప్తంగా 136 పరీక్షా కేంద్రాల ఏర్పాటు.
	
	► ఇవాళ ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది.
	
	ఐపీఎల్‌లో నేడు
	ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో తలపడనున్న హైదరాబాద్ సన్‌రైజర్స్. ఢిల్లీ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం.
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
