breaking news
today news
-
సాక్షి మార్నింగ్ రౌండప్: జులై 22.. నేటి బిగ్ హెడ్‌లైన్స్ ఇవే!
సాక్షి పాఠకులకు శుభోదయం!. దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ వేడి మరింత పెరిగింది. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై ఆందోళనలు ఉధృతం కాగా.. ప్రధాని నివాసం వద్ద రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రతిపక్షాలు నిరసన నాటకీయ పరిణామాలకు దారి తీసింది. దీనికి నిరసనగా కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసనలకు పిలుపు ఇచ్చింది. మరోవైపు ఇరాన్‌పై అమెరికా దాడులు 11వ రోజుకు చేరడంతో మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ‘చలో లోక్‌భవన్’ నిరసనలకు పిలుపునిచ్చింది. ఏపీ రాజకీయాల్లో వైఎస్ జగన్ వరుస సమావేశాలతో బిజీగా ఉన్నారు. ఇవాళ పొగాకు రైతులతో భేటీ కానున్నారు..ప్రధాని నివాసం వద్ద యుద్ధ వాతావరణం నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై ఢిల్లీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ‘చలో సంసద్’ మార్చ్‌పై పోలీసుల చర్యకు నిరసనగా.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో మంగళవారం ప్రతిపక్ష నేతలు ప్రధాని నివాసం వైపు నిరసన చేపట్టారు.ప్రతిపక్ష నేతలను పోలీసులు బలవంతంగా తరలించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి స్వల్ప గాయాలు అయ్యాయని, ముక్కు నుంచి రక్తం వచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. నేడు కూడా విపక్షాలు తమ నిరసనలు కొనసాగించే అవకాశం ఉంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ CJP నేతృత్వంలో మూడో రోజు కూడా ఆందోళనలు కొనసాగనున్నాయి.తెలంగాణలో కాంగ్రెస్ ధర్నాలు రాహుల్ గాంధీ అరెస్ట్‌కు నిరసనగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు సిద్ధమైంది. ‘చలో లోక్‌భవన్’కు పిలుపునిచ్చింది. రాష్ట్రంలోని కీలక నేతల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నారు.నీట్‌పై సమగ్ర చర్చకు సిద్ధం: ధర్మేంద్ర ప్రధాన్ నీట్ వ్యవహారంపై పార్లమెంట్లో సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. విద్యార్థులను రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ఉపయోగించుకుంటోందని ఆయన ఆరోపించారు. విద్యార్థులకు కావాల్సింది సమాధానాలు, సంస్కరణలు, జవాబుదారీతనం అని పేర్కొన్నారు. ప్రధాని నివాసం వద్ద ప్రతిపక్షాల నిరసన ప్రజాస్వామ్య పద్ధతి కాదని.. భద్రతాపరమైన ఆందోళనలకు దారితీస్తుందని ప్రభుత్వ వర్గాలు విమర్శించాయి.ఇరాన్‌పై అమెరికా దాడులు 11వ రోజుకు.. మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు కొనసాగుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా వరుసగా 11వ రోజు వైమానిక దాడులు జరిపింది. ఇరాన్ సైనిక స్థావరాలు, క్షిపణి ప్రయోగ కేంద్రాలు, డ్రోన్ సైట్లు లక్ష్యంగా దాడులు చేస్తున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. మరోవైపు హార్ముజ్ జలసంధిపై ఆధిపత్యం కోసం ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన ఈ మార్గంలో రవాణా దాదాపు నిలిచిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం పడుతోంది.అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా తీవ్రంగా స్పందిస్తోంది. జోర్డాన్, బహ్రెయిన్, కువైట్‌లపై దాడులు జరగడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.చమురు ధరలపై యుద్ధ ప్రభావం ఇరాన్-అమెరికా ఘర్షణల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరుగుతున్నాయి. హార్ముజ్ జలసంధిలో రవాణా అంతరాయం కొనసాగితే ప్రపంచ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.పాలా మున్సిపాలిటీలో రాజకీయ షాక్ దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన మున్సిపల్ చైర్పర్సన్ దియా బిను పులిక్కకండం పదవి కోల్పోయారు. కేరళలోని పాలా మున్సిపాలిటీలో ఎల్డీఎఫ్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో యూడీఎఫ్ పాలన ముగిసింది. కాంగ్రెస్‌కు చెందిన నలుగురు కౌన్సిలర్లు పార్టీ విప్‌ను ధిక్కరించి అవిశ్వాసానికి మద్దతు తెలిపారు.సూరత్‌లో ఏఐ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు గుజరాత్ సూరత్ పోలీసులు ఏఐ ఆధారంగా సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నారు. 18 ఏళ్ల చదువు మానేసిన యువకుడు ఈ నెట్‌వర్క్‌ను నడిపినట్లు పోలీసులు గుర్తించారు.భారీ వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక.. దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్రల్లో బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. దక్షిణాది రాష్ట్రాల్లో వాతావరణం సాధారణంగా ఉండనుంది.పొగాకు రైతులతో వైఎస్ జగన్ భేటీ.. వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు పొగాకు రైతులతో సమావేశం కానున్నారు. గిట్టుబాటు ధర, మార్కెటింగ్ సమస్యలు సహా పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. కూటమి పాలనలో అవస్థలు పడుతున్న వివిధ వర్గాల ప్రజలతో జగన్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.తెలంగాణలో గిగ్ వర్కర్ల సమ్మె.. తెలంగాణలో గిగ్ వర్కర్లు సమ్మెకు దిగనున్నారు. 12 గంటల పాటు సేవలను నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. స్విగ్గీ, ర్యాపిడో, జొమాటో, ఓలా, ఉబెర్ తదితర సేవలు నిలిచిపోనున్నాయి. మినిమమ్ చార్జిని ప్రభుత్వం నిర్ణయించాలని.. తమ డిమాండ్లను పరిశీలించాలని అసోషియేషన్ కోరుతోంది. ప్రభుత్వం స్పందించకపోతే ఆగస్టు 8 తర్వాత నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు.సిక్కిం విషాదంలో పెరిగిన మృతుల సంఖ్య.. సిక్కింలో టన్నెల్ కూలిన ఘటనలో 20 మంది మృతి చెందినట్లు సమాచారం. పలువురు గల్లంతయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.హైదరాబాద్ పోలీస్ అకాడమీ కేసులో ట్విస్ట్.. హైదరాబాద్ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్‌లకు సంబంధించిన లైంగిక వేధింపుల కేసు కీలక మలుపు తిరిగింది. కేసును షీ టీంకు అప్పగించారు. డీసీపీ లావణ్య నాయక్ జాదో పర్యవేక్షణలో విచారణ కొనసాగనుంది. మరోవైపు ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ట్రైనీ ఐపీఎస్, లైంగిక వేధింపుల నిందితుడు ఉదయ్ కృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.ఈరోజు ఫోకస్లో..* ప్రధాని నివాసం వద్ద ప్రతిపక్షాల నిరసన* రాహుల్ గాంధీకి గాయాల ఆరోపణలు* నీట్ లీకేజీపై పార్లమెంట్లో రగడ* ఇరాన్‌పై అమెరికా 11వ రోజు దాడులు* హార్ముజ్ జలసంధిపై పెరుగుతున్న ఉద్రిక్తతలు* తెలంగాణ కాంగ్రెస్ నిరసనలు* వైఎస్ జగన్ పొగాకు రైతులతో భేటీ* గిగ్ వర్కర్ల సమ్మె* సిక్కిం టన్నెల్ ప్రమాదం* హైదరాబాద్ పోలీస్ అకాడమీ కేసు అప్డేట్లు మరిన్ని బ్రేకింగ్ అప్డేట్స్, విశ్లేషణలు, ప్రత్యేక కథనాల కోసం రోజంతా సాక్షి.కామ్‌తోనే ఉండండి. -
సాక్షి మార్నింగ్ రౌండప్ జులై 21: ఈరోజు బిగ్ హెడ్‌లైన్స్ ఇవే!
సాక్షి పాఠకులకు శుభోదయం!. ప్రపంచాన్ని మరోసారి ఆందోళనకు గురిచేస్తూ ఇరాన్‌పై అమెరికా దాడులు పదో రోజుకు చేరాయి. మరోవైపు ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు, నిరసనల వేడి కొనసాగనుంది. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్ భేటీ ఆసక్తిని రేపుతోంది. ఏపీలో గుంటూరు ఘటనకు నిరసనగా వైఎస్సార్సీపీ ఆందోళనలకు పిలుపునిచ్చింది.అల్పపీడన ప్రభావంతో.. తెలుగు రాష్ట్రాల్లో గత రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇవాళ కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నెల 23న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో మరో వారంపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఎల్ నినో ఆందోళనలతో లోటు వర్షపాతంతో నైరుతి ప్రభావం తగ్గిందనుకున్న తరుణంలో.. అనూహ్యంగా దేశం మొత్తం దట్టంగా మేఘాలు అలుముకోవడం, వర్షాలు కురుస్తుండడం ఉన్న రైతులకు ఇది ఊరట ఇచ్చే వార్త అనే చెప్పొచ్చు.ఇరాన్ వార్ కంటిన్యూమిడిల్ఈస్ట్లో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా వరుసగా పదో రోజు కూడా వైమానిక దాడులు కొనసాగించింది. హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులను అడ్డుకునే లక్ష్యంతో ఈ దాడులు చేస్తున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఇరాన్ దాడుల్లో అమెరికా సైనికులు మృతి చెందడంతో ప్రతీకార చర్యలు కొనసాగుతున్నాయని అమెరికా తెలిపింది. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్ వంటి అమెరికా మిత్ర దేశాలపై ఇరాన్ దాడులు చేయడం ఉద్రిక్తతలను మరింత పెంచింది.మరోవైపు దౌత్య ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. ఇరాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఎస్కందర్ మొమెని పాకిస్థాన్‌కు వెళ్లి చర్చలు జరుపుతున్నారు. యుద్ధ విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తోంది.హార్ముజ్ జలసంధిపై ఆందోళన.. పెరుగుతున్న చమురు ధరలుప్రపంచ ఇంధన సరఫరాలో కీలకమైన హార్ముజ్ జలసంధి ద్వారా రవాణా దాదాపు నిలిచిపోయింది. ఈ ప్రభావంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లలో కలకలం రేగుతోంది. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 88 డాలర్లకు(అప్డేట్ అందాల్సి ఉంది) పైగా చేరింది. మరోవైపు యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్ర మార్గంలో సౌదీ అరేబియా చమురు రవాణాను అడ్డుకుంటామని ప్రకటించడం కొత్త ఆందోళనకు కారణమైంది.ఢిల్లీలో కొనసాగనున్న ‘చలో సంసద్’ ఉద్రిక్తతపార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రెండో రోజుకు చేరుకోగా.. ఢిల్లీలో నిరసనల వేడి కొనసాగుతోంది. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఇచ్చిన ‘చలో సంసద్’ పిలుపుతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి.సోమవారం జరిగిన నిరసనలు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించారు. పలువురు నిరసనకారులు, పోలీసులు గాయపడ్డారు. మంగళవారం కూడా పార్లమెంట్ వైపు మార్చ్ కొనసాగిస్తామని CJP నేతలు ప్రకటించారు. ఇటు నిరససకారుల దాడుల్లో 118 సిబ్బందికి గాయాలు అయ్యాయని, 20 ప్రభుత్వ వాహనాలు ధ్వంసం అయ్యాయని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. పార్లమెంట్లో విపక్షాల నిరసనలునిన్న ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు తొలిరోజే వేడెక్కాయి. నీట్ లీకేజీ, అయోధ్య రామమందిర విరాళాల అంశాలపై చర్చకు డిమాండ్ చేస్తూ విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి. ఈరోజు కూడా ఈ అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం జరిగే అవకాశం ఉంది. ఎలాగైనా మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లులను ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కేంద్రం ప్రయత్నిస్తోంది.యూపీ రాజకీయాల్లో కీలక పరిణామం!ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ దాదాపు గంటపాటు సమావేశమయ్యారు. ఈ భేటీలో యూపీ అసెంబ్లీ ఎన్నికల సీట్ల పంపకం, అయోధ్య రామమందిర విరాళాల వ్యవహారం వంటి అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. కాంగ్రెస్ ఎక్కువ సీట్లు కోరుతుండగా.. గెలుపు అవకాశాల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉండాలని అఖిలేశ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.గుంటూరు ఘటనకు నిరసనగా వైఎస్సార్సీపీ ఆందోళనలుగుంటూరు కృష్ణబాబు కాలనీలో మహిళపై జరిగిన దాడి ఘటనకు నిరసనగా వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. జిల్లా కేంద్రాల్లోని అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించనున్నారు. మహిళను వివస్త్ర చేసి దాడి చేసిన ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.మార్కెట్లపై ఫోకస్ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల పెరుగుదల, అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. ఇన్వెస్టర్లు ప్రపంచ మార్కెట్ల కదలికలను నిశితంగా గమనిస్తున్నారు.ఈరోజు ఫోకస్లో..ఇరాన్‌పై అమెరికా దాడులు.. పదో రోజుకు చేరిన యుద్ధంహార్ముజ్ జలసంధిపై పెరుగుతున్న ఉద్రిక్తతలుఢిల్లీలో కొనసాగనున్న ‘చలో సంసద్’ నిరసనలుపార్లమెంట్లో నీట్, అయోధ్య అంశాలపై రగడరాహుల్-అఖిలేశ్ భేటీ.. యూపీ పొత్తులపై చర్చగుంటూరు ఘటనపై వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్త ఆందోళనలుమార్కెట్లు, వాతావరణ అప్డేట్స్ -
Indigo Crisis: పార్లమెంట్లో రామ్మోహన్ నాయుడికి అవమానం
-
ఆర్థిక సంస్కరణల సారథి, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్సింగ్ అస్తమయం
-
టాప్ 50 హెడ్ లైన్స్@1PM 18 June 2024
-
టాప్ 30 హెడ్ లైన్స్@11AM 18 June 2024
-
టాప్ 50 హెడ్ లైన్స్@8AM 18 June 2024
-
టాప్ 30 హెడ్ లైన్స్@3PM 14 June 2024
-
టాప్ 30 హెడ్‌లైన్స్@11:45 AM 06 June 2024
-
టాప్ 50 హెడ్‌లైన్స్@07:45 AM 06 June 2024
-
టాప్ 30 హెడ్‌లైన్స్@11:30AM 28 May 2024
-
టాప్ 30 హెడ్‌లైన్స్@11AM 27 May 2024
-
టాప్ 50 హెడ్‌లైన్స్@08:30AM 27 May 2024
-
టాప్ 30 హెడ్‌లైన్స్@11AM 26 May 2024
-
టాప్ 50 హెడ్‌లైన్స్@08:30AM 26 May 2024
-
టాప్ 50 హెడ్‌లైన్స్@08:30AM 25 May 2024
-
టాప్ 50 హెడ్‌లైన్స్@8AM 24 May 2024
-
టాప్ 50 హెడ్‌లైన్స్@11AM 14 May 2024
-
టాప్ 50 హెడ్‌లైన్స్@3PM 01 May 2024
-
టాప్ 50 హెడ్‌లైన్స్@9AM 30 April 2024
-
టాప్ 50 హెడ్‌లైన్స్@07:30 AM 23 April 2024
-
మార్నింగ్ ప్రైమ్ టైం@10:40AM 16 April 2024
-
సాక్షి స్పీడ్ న్యూస్@07:45AM 16 April 2024
-
సాక్షి స్పీడ్ న్యూస్@07:30 AM 12 April 2024
-
టాప్ 50 హెడ్‌లైన్స్@12:45PM 09 April 2024
-
సాక్షి స్పీడ్ న్యూస్@7AM 09 April 2024
-
టాప్ 30 న్యూస్@11:15AM 05 April 2024
-
మార్నింగ్ ప్రైమ్ టైం న్యూస్@11AM 05 April 2024
-
టాప్ 30 న్యూస్@07:30AM 02 April 2024
-
నేషనల్ న్యూస్@03:45PM 29 March 2024
-
సాక్షి స్పీడ్ న్యూస్@03:15PM 29 March 2024
-
సాక్షి స్పీడ్ న్యూస్@07:45 AM 26 March 2024
-
దొంగలను తరిమికొట్టిన తల్లీ కూతుర్లు
-
Gold Price : ఆల్ టైం రికార్డ్
-
మహిళల శక్తి.. ఈ ముగ్గురికి మూడినట్టే
-
టాప్ 30 హెడ్‌లైన్స్@11:30AM 21 March 2024
-
సాక్షి స్పీడ్ న్యూస్@07:45 AM 21 March 2024
-
టాప్ 30 హెడ్‌లైన్స్@10:15 AM 19 March 2024
-
సాక్షి స్పీడ్ న్యూస్@07:30AM 19 March 2024
-
టీడీపీ శ్రేణుల రాళ్ళ దాడిని ఖండించిన బోళ్ల బ్రహ్మనాయుడు
-
ప్రధాన వార్తలు @ 02:00 PM 14-03-2024
-
సీఏఏపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా..!
-
ఏపీలో ఒరిజినల్ బీజేపీ లీడర్ల సంచలన నిర్ణయం
-
సాక్షి స్పీడ్ న్యూస్@02:30PM 13 March 2024
-
మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నాం: సీతక్క
-
భారత్ లో BYD Seal మూడు కొత్త వెర్షన్...!
-
ప్రధాన వార్తలు @ 05:30 PM 05-03-2024
-
టాప్ 50 హెడ్‌లైన్స్@08:30AM 05 March 2024
-
టాప్ హెడ్‌లైన్స్@06:30AM 05 March 2024
-
ప్రధాన వార్తలు @ 05:40 PM 04-03-2024
-
ప్రధాన వార్తలు @ 03:00 PM 02-03-2024
-
ప్రధాన వార్తలు @ 11:00 AM 02-03-2024
-
కొత్త రికార్డులు నమోదు చేసిన సెన్సెక్స్, నిఫ్టీ
-
ప్రధాన వార్తలు @ 02:30 PM 27-02-2024
-
ప్రధాన వార్తలు @ 5:00 PM 22-02-2024
-
ప్రధాన వార్తలు @ 5:00 PM 21-02-2024
-
సాక్షి టాప్ హెడ్‌లైన్స్@06:45AM 21 February 2024
-
ప్రధాన వార్తలు @ 5:00 PM 20-02-2024
-
బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ అంటే ఏమిటి?
-
టాప్ హెడ్‌లైన్స్@06:30AM 20 February 2024
-
ప్రధాన వార్తలు @ 5:45 PM 17-02-2024
-
అమెరికన్ బ్యాంకు డేటా లీక్
-
భారీ ఉద్యోగాలకు డోర్లు తెరవనున్న Flipkart
-
టాప్ 50 హెడ్‌లైన్స్@6AM 13 February 2024
-
ప్రధాన వార్తలు 9-02-2024 @ 5:00 PM
-
IPO Listing: ఎంట్రీతోనే అదరగొట్టిన ఐపీవో
-
ప్రధాన వార్తలు 8-02-2024 @ 05:30 PM
-
టాప్ 30 హెడ్‌లైన్స్@9PM 07 February 2024
-
2024లో భారీగా ఐటి ఉద్యోగాల కోత
-
నేను అమెరికా వెళ్ళినప్పుడు ఒక కుర్రాడు YSR గురించి ఏమన్నాడంటే
-
ఆత్మనిర్భర భారత్, డిజిటల్ ఇండియా మన బలం
-
దేశంలోనే తొలిసారిగా ఒకేసారి 30.61 లక్షల ఇళ్ల పట్టాలు
-
ప్రధాన వార్తలు 31-01-2024 @09:00 AM
-
టుడే న్యూస్ పేపర్ టాప్ హెడ్ లైన్స్
-
ప్రధాన వార్తలు 30-01-2024 @ 2:15 PM
-
టాప్ 30 హెడ్‌లైన్స్@09:45AM 23 January 2024
-
త్వరలోనే ఎగిరే ట్యాక్సీ.. అదీ మన హైదరాబాద్‌లోనే..!
-
ప్రధాన వార్తలు 19-01-2024 @ 02:30 PM
-
టాప్ 30 హెడ్‌లైన్స్@02:50PM 18 January 2024
-
టాప్ 30 హెడ్‌లైన్స్@7AM 16 January 2024
-
టాప్ 30 హెడ్‌లైన్స్@5PM 12 January 2024
-
టాప్ 30 హెడ్‌లైన్స్@03:45PM 12 January 2024
-
సాక్షి స్పీడ్ న్యూస్@09:45AM 12 January 2024
-
సాక్షి స్పీడ్ న్యూస్@09:45AM 11 January 2024
-
ప్రధాన వార్తలు 09-01-2024 @ 05:15 PM
-
ప్రధాన వార్తలు 09-01-2024 @ 03:15 PM
-
ప్రధాన వార్తలు 08-01-2024 @ 05:00 PM
-
ప్రధాన వార్తలు 6-01-2024 @6:25 PM
-
ప్రధాన వార్తలు 05-01-2024 @ 05:00 PM
-
టాప్ 30 హెడ్‌లైన్స్@04:45PM 05 January 2023
-
ప్రధాన వార్తలు 04-01-2024 @ 05:00 PM
-
టాప్ హెడ్‌లైన్స్@10:30AM 02 January 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@07:45AM 02 January 2024
-
ప్రధాన వార్తలు 30 December 2023 @ 06:00 PM
-
ప్రధాన వార్తలు 30 December 2023 @ 04:15 PM
-
ప్రధాన వార్తలు 30 December 2023 @ 02:00 PM
-
టాప్ 30 హెడ్‌లైన్స్@4PM 29 December 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@02:45PM 28 December 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@04:45PM 26 December 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@4PM 26 December 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@01:45PM 26 December 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@10:45AM 26 December 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@10AM 26 December 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@3PM 22 December 2023
-
ప్రధాన వార్తలు 20 December 2023 @ 04:00 PM
-
ప్రధాన వార్తలు 20 December 2023 @ 3:15 PM
-
ప్రధాన వార్తలు 18 December 2023 @ 05:00 PM
-
ప్రధాన వార్తలు 18 December 2023 11:00 AM
-
ప్రధాన వార్తలు 15 December 2023 05:00 PM
-
ప్రధాన వార్తలు 15 December 2023 @ 04:15 PM
-
టాప్ 30 హెడ్‌లైన్స్@04:45PM 14 December 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@03:45PM 14 December 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@02:30PM 14 December 2023
-
ప్రధాన వార్తలు 13 December 2023 @ 05:15 PM
-
ప్రధాన వార్తలు 13 December 2023 @ 03:00 PM
-
టాప్ 30 హెడ్‌లైన్స్@04:45PM 12 December 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@02:45PM 12 December 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@2PM 12 December 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@12:50PM 12 December 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@10:45AM 12 December 2023
-
ప్రధాన వార్తలు 11 December 2023 @ 02:00 PM
-
టాప్ 30 హెడ్‌లైన్స్@04:45PM 09 December 2023
-
ప్రధాన వార్తలు 8 December 2023 @ 05:00 PM
-
టాప్ 30 హెడ్‌లైన్స్@03:45PM 08 December 2023
-
ప్రధాన వార్తలు 7 December 2023 @ 04:00 PM
-
ప్రధాన వార్తలు 7 December 2023 @ 03:00 PM
-
ప్రధాన వార్తలు 6 December 2023 @ 05:00 PM
-
ప్రధాన వార్తలు 6 December 2023 @ 12:30 PM
-
ప్రధాన వార్తలు 6 December 2023 @ 10:20 AM
-
టాప్ 30 హెడ్‌లైన్స్@10:45AM 06 December 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@10AM 06 December 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@06:30AM 06 December 2023
-
ప్రధాన వార్తలు 5 December 2023 @ 06:00 PM
-
టాప్ 30 హెడ్‌లైన్స్@04:40PM 05 December 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@03:30PM 05 December 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@3PM 05 December 2023
-
ప్రధాన వార్తలు 4 December 2023 @ 03:00 PM
-
టాప్ 30 హెడ్‌లైన్స్@6AM 03 December 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@02:55PM 02 December 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@06:45PM 01 December 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@4PM 01 December 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@03:45PM 29 November 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@02:45PM 29 November 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@02:30PM 28 November 2023
-
ప్రధాన వార్తలు @27 November 2023 @ 02:00 PM
-
ప్రధాన వార్తలు @27 November 2023 @ 11:15 AM
-
ప్రధాన వార్తలు @24 November 2023 @ 05:30 PM
-
ప్రధాన వార్తలు @23 November 2023 @ 02:30 PM
-
టాప్ 30 హెడ్‌లైన్స్@11:45AM 23 November 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@10AM 23 November 2023


