టుడే న్యూస్‌ అప్‌డేట్స్‌ | today news updates | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్‌ అప్‌డేట్స్‌

Jun 29 2017 6:58 AM | Updated on Sep 5 2017 2:46 PM

ఇవాళ ఉపరాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల కానుంది.

ఉపరాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్‌
న్యూఢిల్లీ: ఇవాళ ఉపరాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల కానుంది. హమీద్‌ అన్సారీ పదవికాలం ఆగస్టులో ముగియనుంది.

ట్రిపుల్‌ ఐటీ జాబితా
ట్రిపుల్‌ ఐటీ ఎంపిక జాబితా నేడు విడుదల కానుంది. నూజివీడు శ్రీకాకుళం, ఇడుపులపాయ, ఒంగోలు ట్రిపుల్‌ ఐటీల్లో పీయూసీ ఫస్టియర్‌ ప్రవేశాల్లో ఎంపిక జాబితాను విడుదల చేయనున్నారు.

మోదీ గుజరాత్‌ పర్యటన
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు గుజరాత్‌లో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు గుజరాత్‌లో పర్యటించనున్నారు. అహ్మదాబాద్‌లో సబర్మతి ఆశ్రయం సెంటినరీ వేడుకలను మోదీ ప్రారంభిస్తారు.

2నుంచి భారీ వర్షాలు
విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఉత్తర ఒడిశాపై జార్ఖండ్‌కు ఆనుకొని ఉపరితల ఆవర్తనం, ఒడిషా నుంచి దక్షిణ తమిళనాడు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురువనున్నాయి.

జులై 11 నుంచి ఐసెట్‌ కౌన్సెలింగ్‌
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఏపీ ఐసెట్‌-2017 కౌన్సెలింగ్‌ను జులై 11 నుంచి ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

అక్బరుద్దీన్‌ కేసులో తీర్పు
హైదరాబాద్‌: ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌పై దాడి కేసులో నేడు నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించనుంది. 2011 ఎప్రిల్‌ 30న బార్కస్‌లో అక్బరుద్దీన్‌పై దాడి. పహిల్వాన్‌ గ్యాంగ్‌ దాడి చేసినట్లు కోర్టుకు తెలిపిన అక్బరుద్దీన్.

తిరుమలలో రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 10 గంటలు, ప్రత్యేక ప్రవేశదర్శనానికి 3 గంటలు, నడక భక్తులకు 7 గంటల సమయం పడుతోంది.

వెస్టిండీస్‌తో భారత్‌ ఢీ
మహిళల క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ క్రికెట్‌లో భాగంగా నేడు వెస్టిండీస్‌తో భారత్‌ తలపడనుంది. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement