టుడే న్యూస్‌ అప్‌డేట్స్‌ | today news | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్‌ అప్‌డేట్స్‌

Jun 27 2017 7:44 AM | Updated on Sep 5 2017 2:36 PM

మూడు దేశాల పర్యటనలో భాగంగా అమెరికా వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌తో భేటీ అయ్యారు

అమెరికా పర్యటనలో మోదీ
మూడు దేశాల పర్యటనలో భాగంగా అమెరికా వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌తో భేటీ అయ్యారు. భారత్‌- అమెరికా మధ్య చర్చలు సానుకూలంగా జరిగాయని సంయుక్త ప్రకటనలో ట్రంప్‌ వెల్లడించారు.

మీరాకుమార్‌ నామినేషన్‌
ఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ నేడు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.

ఢిల్లీ వెల్లనున్న టీపీసీసీ నేతలు
తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు నేడు ఢిల్లీ వెల్లనున్నారు. మీరాకుమార్‌ నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు.. మియాపూర్‌ భూముల కుంభకోణంపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నారు.

చిత్తూరు జైల్లో చెవిరెడ్డి దీక్ష
చెత్త డంపింగ్‌యార్డు తరలింపు కోసం వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి జైల్లోనూ నిరసన కొనసాగిస్తున్నారు. నాలుగు రోజులుగా ఆహారం తీసుకోకుండా దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే పాటు మరో 35 మంది నిరసన దీక్షకు దిగారు. సి. రామాపురంలోని చెత్త డంపింగ్‌ యార్డు ఎత్తివేసేవరకు పోరాటం ఆగదని చెవిరెడ్డి స్పష్టం చేశారు.

గగపర్రులో 144 సెక్షన్
పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రులో 144 సెక్షన్‌ కొనసాగుతోంది. అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు విషయంలో వివాదం తలెత్తడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కలెక్టర్‌, ఎస్పీ ఆధ్వర్యంలో విచారణ చేపడుతున్నారు.

నేడు గగపర్రుకు వైఎస్‌ఆర్‌ సీపీ కమిటీ
పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రులో నేడు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ కమిటీ పర్యటించనుంది. పార్టీ నేతలు ధర్మాన ప్రసాదరావు, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, ఆళ్ల నాని, మేరుగ నాగార్జున తదితరులు గరగపర్రులో పర్యటించి వాస్తవాలను తెలుసుకోనున్నారు.

పంచాయితీరాజ్‌ మంత్రుల మీటింగ్‌
మధ్యప్రదేశ్‌: భోపాల్‌లో నేడు పంచాయితీరాజ్‌ మంత్రుల సమావేశం

తిరుమలలో సాధారణ రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సర్వదర్శనానికి 14 గంటలు, నడక భక్తులకు 12 గంటల సమయం పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement