వస్తు సేవల పన్ను(జీఎస్టీ) శుక్రవారం అర్థరాత్రి నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానుంది
అమల్లోకి జీఎస్టీ
వస్తు సేవల పన్ను(జీఎస్టీ) శుక్రవారం అర్థరాత్రి నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానుంది. ఒక దేశం-ఒకే పన్ను నినాదంతో 18 రకాల పరోక్ష పన్నుల స్థానంలో జీఎస్టీని ప్రవేశపెడుతున్నారు. నేడు పార్లమెంటరీ సెంట్రల్ హాల్‌లో జీఎస్టీ ప్రారంభోత్సవ కార్యక్రమం.
గరగపర్రుకు వైఎస్ జగన్
పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో సాంఘిక బహిష్కరణకు గురైన దళితులను వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు పరామర్శించనున్నారు. సాయంత్రం కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో విషజ్వరాలు, అంతుచిక్కని వ్యాధులతో బాధపడుతున్న గిరిజనులను వైఎస్ జగన్ పరామర్శిస్తారు.
రెండు రోజులు భారీ వర్షాలు
ఒడిషా నుంచి తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలంగాణలో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
పీఈసెట్ ఫలితాలు
హైదరాబాద్: రాష్ట్రంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీల్లో డీపీఈడీ, బీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీఈసెట్ ఫలితాలు నేడు వెలువడనున్నాయి.
నేటి నుంచి ఈసెట్ కౌన్సెలింగ్
హైదరాబాద్: పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయిన అభ్యర్ధులు ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంఓ చేరేందుకు ప్రవేశాల కౌన్సెలింగ్ నేడు ప్రారంభం కానుంది.
అహ్మదాబాద్‌కు చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు అహ్మదాబాద్ వెళ్లనున్నారు. టెక్స్‌టైల్ ఫెయిర్‌లో ఆయన పాల్గొంటారు.
నీట్ రాష్ట్ర స్థాయి ర్యాంకుల విడుదల!
అమరావతి: నేడు నీట్ రాష్ట్ర స్థాయి ర్యాంకులను వెల్లడించనున్నట్లు సమాచారం. ఈ నెల 23న నీట్ ఫలితాలు విడుదలైనా.. సీబీఎస్‌ఈ నుంచి రాష్ట్రాలకు చేరని సమాచారం. ఇవాళ కూడా రాకుంటే సోమవారం వరకు వేచి ఉండాలని అధికారులు వెల్లడించారు.
తిరుమలలో రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 18 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 10 గంటలు, నడక భక్తులకు 8 గంటల సమయం పడుతోంది.
మూడో వన్డే
ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు భారత్ వెస్టిండీస్‌ల మధ్య మూడో వన్డే జరగనుంది. ఆంటిగ్వాలో సాయంత్రం 6:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం. సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది.