ముస్లిం సోదరులు పవిత్రమైన రంజాన్ (ఈద్–ఉల్– ఫితర్) పండుగను నేడు జరుపుకోనున్నారు
నేడే రంజాన్
ముస్లిం సోదరులు పవిత్రమైన రంజాన్ (ఈద్–ఉల్– ఫితర్) పండుగను నేడు జరుపుకోనున్నారు. ఆదివారం రాత్రి నెల వంక దర్శనమిచ్చినట్లు హైదరాబాద్ రూహియత్–ఏ–హిలాల్ కమిటీ అధ్యక్షుడు మౌలానా ఖుబూల్ పాషా సుత్తారి ప్రకటించారు. రంజాన్ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రజలకు శుభా కాంక్షలు తెలిపారు.
సామరస్యానికి ప్రతీక రంజాన్: వైఎస్ జగన్
రంజాన్ పండుగను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈద్ ముబారక్ తెలిపారు. రంజాన్ పండుగ సామరస్యానికి, సుహృద్భా వానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని, ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు.
ట్రంప్‌తో మోదీ భేటీ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికాలో పర్యటిస్తున్నారు. నేడు వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మోదీ భేటీ కానున్నారు.
నేడూ రేపు భారీ వర్షాలు
ఉత్తర బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో రుతుపవనాలు పుంజుకుంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురువనున్నాయి.
తిరుమలలో పెరిగిన రద్దీ
తిరుమలలో సోమవారం ఉదయం భక్తుల రద్దీ పెరిగింది. 27 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 12 గంటలు, కాలి నడక భక్తులకు 10 గంటల సమయం పడుతోంది.