
నేటి త్రిసభ్య కమిటీ భేటీ వాయిదా
గవర్నర్ సమక్షంలో నేడు జరగాల్సిన రెండు రాష్ట్రాల త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా పడింది.
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సమక్షంలో సోమవారం జరగాల్సిన రెండు రాష్ట్రాల త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా పడింది. పునర్విభజనకు సంబంధించి ఏపీ, తెలంగాణ మధ్య పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీలు చర్చలు జరుపుతున్నాయి. ఇప్పటికే మూడు విడతలుగా జరిగిన సమావేశంలో విద్యుత్ ఉద్యోగుల పంపిణీ, ఉద్యోగుల పరస్పర అంగీకార బదిలీలు, సచివాలయంలో ఏపీ భవనాల అప్పగింతలపై చర్చించారు.