నగరంలోని నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ : నగరంలోని నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 4 తులాల బంగారం, మూడు తులాల వెండితోపాటు మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్కి తరలించారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా తమదైన శైలిలో పోలీసులు అతడిని విచారిస్తున్నారు.