లిఫ్ట్ పేరుతో దోచేస్తున్నాడు.. | theft in the name of lift | Sakshi
Sakshi News home page

లిఫ్ట్ పేరుతో దోచేస్తున్నాడు..

Jan 7 2016 8:39 PM | Updated on Sep 4 2018 5:07 PM

లిఫ్టు ఇస్తానంటూ మహిళలను మోసగించి... దోపిడీకి పాల్పడుతున్న ఘరానా మోసగాడిని నార్త్‌జోన్ పోలీసులు పట్టుకుని రిమాండ్‌కు తరలించారు.

లిఫ్టు ఇస్తానంటూ మహిళలను మోసగించి... దోపిడీకి పాల్పడుతున్న ఘరానా మోసగాడిని నార్త్‌జోన్ పోలీసులు పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. నార్త్‌జోన్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి గురువారం వెల్లడించిన వివరాలివీ.. రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలం నారపల్లికి చెందిన నిందితుడు హుస్సేన్ ఖాన్(40) బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, హాస్పిటళ్ల వద్ద నిలుచుని ఉండే ఒంటరి మహిళలతో మాటలు కలిపి, లిఫ్ట్ ఇస్తానని చెప్పి తన వాహనంపై నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళతాడు.

అక్కడ వారిని భయపెట్టి బంగారు ఆభరణాలు, నగదు దోచుకెళ్తాడు. ఇలా ఏడాది కాలంలోనే హుస్సేన్ ఆరు దోపీడీలకు పాల్పడ్డాడు. ఇతడిపై కన్నేసిన పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి పది తులాల బంగారం, 6 తులాల వెండి, ఆల్టో కారు, హోండా యాక్టివా బైకు సహా మొత్తం రూ.7లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement