పోలీస్ ఇంట్లో దొంగల చేతివాటం | theft in police's house in hyderabad | Sakshi
Sakshi News home page

పోలీస్ ఇంట్లో దొంగల చేతివాటం

Jun 6 2015 12:13 PM | Updated on Aug 21 2018 7:53 PM

హైదరాబాద్ నగరంలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు.

హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ నగరంలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. ఏకంగా పోలీస్ ఇళ్లల్లోనే చోరీలు చేయటం మొదలుపెట్టారు. తాజాగా పేట్‌బషీరాబాద్ ఇన్‌స్పెక్టర్ శంకర్ యాదవ్ ఇంట్లో శుక్రవారం దొంగలు పడ్డారు. ఈ సంఘటన బోయినపల్లిలోని ఎస్‌బీఐ కాలనీలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ ఇంట్లో రూ.లక్ష నగదు, 8 తులాల బంగారం, 20 తులాల వెండి, 10 తూటాలు, ఒక రివాల్వర్‌ను దొంగిలించారు. ఇన్‌స్పెక్టర్ శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement