21,22 తేదీల్లో నీళ్లు బంద్
మంజీర ఫేజ్-2 పంపింగ్ మెయిన్‌కు మరమ్మతుల కారణంగా ఈ నెల 21,22 తేదీ....
	సిటీబ్యూరో: మంజీర ఫేజ్-2 పంపింగ్ మెయిన్‌కు మరమ్మతుల కారణంగా ఈ నెల 21,22 తేదీ(బుధ, గురువారాలు)ల్లో నగరంలోని వివిధ ప్రాంతాలకు నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు జలమండలి ప్రకటించింది.
	
	కేపీహెచ్‌బీ, హైదర్‌నగర్, జగద్గిరిగుట్ట, ఆల్విన్ కాలనీ, జీడిమెట్ల, షాపూర్ నగర్, చింతల్, భాగ్యనగర్ సెక్షన్, కుత్బుల్లాపూర్, అల్వాల్, నిజాంపేట్, బొల్లారం ప్రాంతాలకు నీటి సరఫరా ఉండదని అధికారులు ప్రకటించారు. మరమ్మతులు పూర్తయిన వెంటనే సరఫరా పునరుద్ధరిస్తామన్నారు.
	 
	 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
