హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో సుమారు 18 గంటల పాటు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని శనివారం జలమండలి ప్రకటించింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) ఆధ్వర్యంలో ప్యారడైజ్ జంక్షన్ నుంచి డెయిరీఫాం రోడ్ వరకు ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో భాగంగా.. పైపులైన్ విస్తరణ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని పేర్కొంది.
అంతరాయం ఏర్పడే ప్రాంతాలు: నల్లగుట్ట, ప్రకాశ్‌నగర్, మేకలమండి, బౌద్ధనగర్, శ్రీనివాస నగర్, పాటిగడ్డ రిజర్వాయర్ పరిధి ప్రాంతాలు. భోలక్‌పూర్, కవాడిగూడ, సీతాఫల్ మండి, హస్మత్‌పేట్, ఫిరోజ్‌గూడ, గౌతమ్‌నగర్. బల్క్ వినియోగదారులు: సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్, మిలిటరీ ఇంజినీరింగ్ సరీ్వసెస్, బేగంపేట్ విమానాశ్రయం. బాలంరాయి పంప్‌హౌస్, బాలంరాయి చెక్‌పోస్ట్, బోయిన్‌పల్లి, రైల్వే కాలనీ పరిధిలో నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందన్నారు. వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి సూచించింది.


