ఇద్దరు ఆన్‌లైన్ మోసగాళ్లు అరెస్ట్ | The arrest of two online cheaters | Sakshi
Sakshi News home page

ఇద్దరు ఆన్‌లైన్ మోసగాళ్లు అరెస్ట్

Mar 16 2016 7:26 PM | Updated on Sep 4 2018 5:07 PM

ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి లక్షల రూపాయల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన నగరంలోని గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న ఇద్దరు యువకులు ఈజీ మనీకి అలవాటు పడి వినియోగదారులను బురిడీ కొట్టించి ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు రావడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ల్యాప్‌టాప్, 3 ట్యాబ్‌లు, ఓ కెమెరా స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement