
అనురాగ్ శర్మ నియామకం సబబే
తెలంగాణ తాత్కాలిక డీజీపీగా అనురాగ్‌శర్మను నియమించడాన్ని సవాలు చేస్తూ సీనియర్ ఐపీఎస్ అధికారులు హెచ్‌ఏ హుడా, టీపీ దాస్ దాఖలు చేసిన పిటిషన్‌ను కేంద్ర
తేల్చి చెప్పిన క్యాట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తాత్కాలిక డీజీపీగా అనురాగ్‌శర్మను నియమించడాన్ని సవాలు చేస్తూ సీనియర్ ఐపీఎస్ అధికారులు హెచ్‌ఏ హుడా, టీపీ దాస్ దాఖలు చేసిన పిటిషన్‌ను కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) కొట్టివేసింది. సీనియారిటీని పరిగణనలోకి తీసుకోకుండా సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా అనురాగ్‌శర్మకు పదోన్నతి ఇచ్చారని పిటిషనర్లు ఆరోపించారు. అయితే క్యాట్ సభ్యులు వెంకటేశ్వర్‌రావు, రంజనా చౌదరిల నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాదనలు విన్న అనంతరం ఈ మేరకు తీర్పు వెలువరించింది. అనురాగ్‌శర్మకు చట్టవిరుద్ధంగా పదోన్నతి ఇచ్చారనే పిటిషనర్ల వాదనను క్యాట్ తోసిపుచ్చింది.
తెలంగాణకు కేటాయించండి..
తనను ఏపీ కేడర్‌కే కేటాయించడాన్ని సవాలు చేస్తూ చిత్తూరు అదనపు ఎస్‌పీ అభిషేక్ మహంతి క్యాట్‌ను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ శేషశయనారెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. దీనిపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు నోటీసులు జారీ చేస్తూ విచారణను జూన్ 7కు వాయిదా వేసింది.