హైదరాబాద్ లో 1000 వైఫై హాట్ స్పాట్స్ | Telangana govt sets up 1,000 WiFi hotspots in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ లో 1000 వైఫై హాట్ స్పాట్స్

Jun 20 2017 5:22 PM | Updated on Sep 4 2018 5:24 PM

హైదరాబాద్ లో 1000 వైఫై హాట్ స్పాట్స్ - Sakshi

హైదరాబాద్ లో 1000 వైఫై హాట్ స్పాట్స్

తెలంగాణ ప్రభుత్వం నగరంలో 1000 పబ్లిక్ హాట్ స్పాట్లను ఏర్పాటుచేసింది.

తెలంగాణ ప్రభుత్వం నగరంలో 1000 పబ్లిక్ హాట్ స్పాట్లను ఏర్పాటుచేసింది. మంగళవారం లాంచ్ చేసిన 'హైదరాబాద్ సిటీ వైఫై' ప్రాజెక్ట్ కింద 1000కి పైగా పబ్లిక్ ప్రదేశాల్లో ఈ వైర్ లెస్ నెట్ వర్క్ టెక్నాలజీని అందించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) మేయర్ బీ రామ్మోహన్ ఈ ప్రాజెక్టు ను లాంచ్ చేశారు. ఈ ప్రాజెక్టు కింద నగరంలో మొత్తం 3000 హాట్ స్పాట్లను ఏర్పాటుచేయనున్నట్టు తెలంగాణ ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ చెప్పారు. వీటికోసం 3000 పబ్లిక్ ప్రాంతాలను కూడా గుర్తించినట్టు చెప్పారు. ప్రస్తుతం ఈ నెట్ వర్క్ 1000 హాట్ స్పాట్లను ఇన్ స్టాల్ చేసింది.
 
ఈ హాట్ స్పాట్ల కింద 5-10ఎంబీపీఎస్ బ్యాండ్ విత్ లో 30 నిమిషాల పాటు ఉచిత వై-ఫైను అందించనుంది. మిగతా 2000 ప్రాంతాల్లో వచ్చే మూడు నెలల్లో ఏర్పాటుచేయనుంది.  ఈ ప్రాజెక్టు మొత్తం ధర రూ.300 కోట్లు. 2015 జూన్ లో తీసుకొచ్చిన డిజిటల్ తెలంగాణ కింద ప్రభుత్వం ఈ పైలెట్ వెర్షన్ హైదరాబాద్ సిటీ వైఫై ప్రాజెక్టును లాంచ్ చేసింది.  ఈ ప్రాజెక్టును వరంగల్, కరింనగర్, ఖమ్మం జిల్లాలకు కూడా విస్తరించనున్నట్టు రంజన్ చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement