ఎంసెట్ ప్రత్యేక కేటగిరీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ | telangana eamcet 3 certificate verification | Sakshi
Sakshi News home page

ఎంసెట్ ప్రత్యేక కేటగిరీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్

Sep 17 2016 10:17 PM | Updated on Sep 4 2017 1:53 PM

తెలంగాణ ఎంసెట్-3లో అర్హత సాధించిన స్పెషల్ కేటగిరీ విద్యార్ధులకు శనివారం కౌన్సిలింగ్‌లో భాగంగా అర్హత ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరయ్యారు.

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-3లో అర్హత సాధించిన స్పెషల్ కేటగిరీ విద్యార్ధులకు శనివారం కౌన్సిలింగ్‌లో భాగంగా అర్హత ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరయ్యారు. కూకట్‌పల్లి జేఎన్‌టీయూ అడ్మిషన్స్ విభాగంలో ఉదయం నుంచి విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ర్యాంకుల వారీగా హాజరై అధికారుల వద్ద తమ సర్టిఫికెట్లను అందజేశారు.

మూడు రోజుల పాటు నిర్వహించే ప్రత్యేక కేటగిరీలో శనివారం ఆంగ్లో ఇండియన్స్, క్రీడా విభాగంలో 10000 ర్యాంకు వరకూ విద్యార్దులు హాజరయ్యారు. సోమవారం వరకూ మిగిలిన ర్యాంకులతో పాటు ఇతర విభాగాలైన ఎన్‌సీసీ, దివ్యాంగులు, ఆర్మీ, పీఎంసీ విభాగాల విద్యార్ధులు హాజరుకానున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement