ప్రాజెక్టులపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలి: చాడ | Telangana decides to create 17 more districts | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టులపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలి: చాడ

Aug 20 2016 2:47 AM | Updated on Mar 18 2019 7:55 PM

ప్రాజెక్టులపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలి: చాడ - Sakshi

ప్రాజెక్టులపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలి: చాడ

ప్రాజెక్టులపై టీఆర్‌ఎస్ సర్కార్, కాంగ్రెస్ పార్టీ చెబుతున్న కాకి లెక్కలు తేలాలంటే వెంటనే అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలని...

సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టులపై టీఆర్‌ఎస్ సర్కార్, కాంగ్రెస్ పార్టీ చెబుతున్న కాకి లెక్కలు తేలాలంటే వెంటనే అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఈ భేటీకి సాగునీటి రంగ నిపుణులను పిలిచి, పూర్తిస్థాయిలో చర్చించాలన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం, ఆయకట్టుపై టీఆర్‌ఎస్ సర్కార్, కాంగ్రెస్ పేర్కొంటున్న లెక్కలు తప్పులతడకగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌పై ఇంజనీర్ల సంఘం తీవ్రంగా స్పందిస్తోందని.. వారు సంయమనంతో వ్యవహరించాలని సూచిం చారు. శుక్రవారం పార్టీ నాయకులు అజీజ్‌పాషా, పల్లా వెంకటరెడ్డిలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతులకు వెంటనే ఇన్‌పుట్ సబ్సిడీని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రుణ మాఫీ మూడో విడత బకాయిలను ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించకపోవడంతో రైతులకు రుణాలు అందే పరిస్థితి లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement