హైదరాబాద్ చేరుకున్న సీఎం కేసీఆర్ | telangana cm kcr reached hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ చేరుకున్న సీఎం కేసీఆర్

Sep 23 2016 7:22 PM | Updated on Sep 4 2018 5:24 PM

హైదరాబాద్ చేరుకున్న సీఎం కేసీఆర్ - Sakshi

హైదరాబాద్ చేరుకున్న సీఎం కేసీఆర్

ఢిల్లీ పర్యటన ముగించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు.

హైదరాబాద్ : ఢిల్లీ పర్యటన ముగించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు. కాగా కృష్ణానదీ జలాల్లో వాటాల కేటాయింపులు, వాటి ఆధారంగా నిర్మిస్తోన్న ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు కేంద్రానికి పరస్పర ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో  కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి ఆధ్వర్యంలో బుధవారం జరిగిన అపెక్స్ సమావేశంలో కేసీఆర్ పాల్గొన్నారు.  కాగా గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలుపై కేసీఆర్ ఢిల్లీ నుంచే ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, ప్రజలుకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement