శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి.
హైదరాబాద్: మిషన్ కాకతీయ ప్రాజెక్టు వల్ల భూగర్భ జలాలు అద్భుతంగా పెరిగాయని తెలంగాణ మంత్రి హరీష్ రావు చెప్పారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన తర్వాత స్పీకర్ మధుసూదనా చారి ప్రశ్నోత్తరాలు చేపట్టారు. తొలుత మిషన్ కాకతీయపై చర్చ జరిగింది.
భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్ కాకతీయ పనులు చేపడుతోందని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతోనే మిషన్ కాకతీయను చేపట్టామన్నారు. త్వరలోనే మిషన్ కాకతీయ మూడో దశ పనులు మొదలవుతాయని తెలిపారు. రైతులు భూములు ఇస్తే కొత్త చెరువుల నిర్మాణం చేపడుతామన్నారు. మెదక్ జిల్లాలో అత్యధికంగా భూగర్భ జలాలు పెరిగాయని మంత్రి చెప్పారు.