తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి చైర్మన్‌గా ఉన్న అసెంబ్లీ రూల్స్ కమిటీ సమావేశం సోమవారం ప్రారంభమైంది.
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి చైర్మన్‌గా ఉన్న అసెంబ్లీ రూల్స్ కమిటీ సమావేశం సోమవారం ప్రారంభమైంది. ఈ సమావేశంలో అసెంబ్లీని డిజిటలైజేషన్ విధానంలో జరిపే అంశంపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర తరహాలో గవర్నర్ ప్రసంగాన్ని ఎవరైనా అడ్డుకుంటే ఒక సంవత్సరం పాటు సస్పెన్షన్ వేటు వేయడంపై ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది.
అలాగే మార్చి తొలి వారంలో జరగనున్న బడ్జెట్ సమావేశాలపై చర్చించనున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన కీలకాంశాలపై చర్చ జరిగే అవకాశముంది.