తెలంగాణ టెట్ పేపర్ 1 ప్రారంభం | Teacher Eligibility Test exam started | Sakshi
Sakshi News home page

తెలంగాణ టెట్ పేపర్ 1 ప్రారంభం

May 22 2016 10:08 AM | Updated on Jul 11 2019 5:01 PM

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఆదివారం ఉదయం పది గంటలకు ప్రారంభమైంది.

హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఆదివారం ఉదయం పది గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష జరుగుతుంది. అన్ని సెంటర్లో పరీక్ష మొదలైంది. పేపర్-2 పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయి. రెండు పరీక్షలకు కలిపి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,73,494 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఎడ్యూకేషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రంజీవ్ ఆచార్య పేపర్ 1 కు సెట్-1 కోడ్ ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేసి విడుదల చేశారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోనికి అనుమతించడం లేదని అధికారులు తెలిపారు. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, మహబూబ్ నగర్ లలో, ఆంధ్రప్రదేశ్ లో విశాఖ, విజయవాడ, నెల్లూరు, తిరుపతి పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement