90 టీడీపీ...బీజేపీ 60? | TDP and BJP shared 90 and 60 divisions in GHMC elections | Sakshi
Sakshi News home page

90 టీడీపీ...బీజేపీ 60?

Jan 16 2016 10:21 AM | Updated on Mar 29 2019 9:31 PM

90 టీడీపీ...బీజేపీ 60? - Sakshi

90 టీడీపీ...బీజేపీ 60?

జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ, బీజేపీ మధ్య ఒప్పందం ఖరారైనట్లు సమాచారం.

హైదరాబాద్:  బీజేపీ- టీడీపీ కూటమిలో గ్రేటర్ ఎన్నికల పొత్తు ఖరారైంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ, బీజేపీ మధ్య సీట్ల పంపకంపై ఒప్పందం కుదిరినట్లు సమాచారం. మొత్తం 150 డివిజన్లకు గాను 60 సీట్లు బీజేపీ, 90 చోట్ల టీడీపీ పోటీ చేయటానికి అంగీకారానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఈ మేరకు రెండు పార్టీల నేతలు సంతకాలు చేసినట్లు తెలుస్తోంది.

 

నామినేషన్లు వేయటానికి ఆదివారం తుది గడువు కావటంతో ఈ రోజు రాత్రికే అభ్యర్థుల జాబితా పూర్తిస్థాయిలో వెలువడే అవకాశం ఉంది. పొత్తుపై ఇరు పార్టీలు అధికారికంగా ప్రకటించనున్నాయి. కాగా సీట్ల పంపకాలపై గత రెండు రోజులుగా ఇరు పార్టీ నేతలు ఎగతెగని చర్చలు జరిపినా ఓ కొలిక్కి రాలేదు. దీంతో శనివారం ఉదయం మరోసారి టీడీపీ-బీజేపీ నేతలు సమావేశమై పొత్తులపై ఓ నిర్ణయానికి వచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement