ముందు ఏపీలో జీవో తీసుకురండి | Talasani Srinivasa Yadav about ntr anniversary | Sakshi
Sakshi News home page

ముందు ఏపీలో జీవో తీసుకురండి

Jan 18 2017 3:20 AM | Updated on Sep 5 2017 1:26 AM

ముందు ఏపీలో జీవో తీసుకురండి

ముందు ఏపీలో జీవో తీసుకురండి

అసెంబ్లీ లాబీలో మంత్రి తలసాని, టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.

ఎన్టీఆర్‌ వర్ధంతి నిర్వహణపై మంత్రి తలసాని
సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ లాబీలో మంత్రి తలసాని, టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఎన్టీఆర్‌ వర్ధంతిని అధికారికంగా నిర్వహించి విశ్వసనీయతను చాటుకోవాల్సిన సమయం వచ్చిందని తలసానిని ఉద్దేశించి సండ్ర వ్యాఖ్యానించగా.. ‘ఎన్టీఆర్‌ వర్ధంతిని అధికారికంగా జరిపేందుకు ముందు ఏపీలో జీవో తీసుకురండి, తర్వాత ఇక్కడ ఆలోచిద్దాం’ అని తలసాని అన్నారు.

దీంతో కార్యక్రమానికి జీవోలుండవని, మౌఖిక ఆదేశాలు మాత్రమే ఉంటాయని రేవంత్‌ జవాబిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలోనే వర్ధంతిని అధికారికంగా నిర్వహించారని, ఇప్పుడు ఏపీలోనూ నిర్వహిస్తున్నారని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement