ఒకే కుటుంబంలోని 9 మందికి స్వైన్ ఫ్లూ! | Swine flu symptoms In Haj Pilgrims at old city in Hyderabad | Sakshi
Sakshi News home page

ఒకే కుటుంబంలోని 9 మందికి స్వైన్ ఫ్లూ!

Nov 9 2014 9:23 AM | Updated on Sep 4 2018 5:07 PM

పాతబస్తీ సైదాబాద్లోని ఒకే కుటుంబానికి చెందిన 9 మంది శనివారం అర్థరాత్రి తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు.

హైదరాబాద్: పాతబస్తీ సైదాబాద్లోని ఒకే కుటుంబానికి చెందిన 9 మంది శనివారం అర్థరాత్రి తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. దీంతో బంధువులు వారిని సికింద్రాబాద్లోని గాంధీ అసుపత్రికి తరలించారు. వారికి స్వైన్ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు భావిస్తున్నారు. ఇటీవలే వీరంతా హజ్ యాత్రకు వెళ్లి వచ్చారని వారి కుటుంబ సభ్యులు వైద్యులకు తెలిపారు.

హజ్ యాత్ర వెళ్లి వచ్చిన నాటి నుంచి వారందరు తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని చెప్పారు. గత అర్థరాత్రి వారి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో బంధువులు ఆసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement