అనుమానంతో అమానుషం | suspected amanusam | Sakshi
Sakshi News home page

అనుమానంతో అమానుషం

Mar 24 2016 12:30 AM | Updated on Sep 3 2017 8:24 PM

అనుమానంతో అమానుషం

అనుమానంతో అమానుషం

అనుమానం పెనుభూతమైంది. వివాహేతర సంబంధం పెట్టుకుందని భావించి భార్యను అతిదారుణంగా అంతం ....

బండరాయితో మోది భార్యను చంపిన భర్త

 

నేరేడ్‌మెట్: అనుమానం పెనుభూతమైంది. వివాహేతర సంబంధం పెట్టుకుందని భావించి భార్యను అతిదారుణంగా అంతం చేశాడో భర్త. నేరేడ్‌మెట్ డీఐ అశోక్‌కుమార్ కథనం ప్రకారం... తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పెడపర్తి గ్రామానికి చెందిన బెజవాడ గణేష్, అదే జిల్లా పెద్దాపురం గ్రామానికి చెందిన వరలక్ష్మి (34)లకు 2001లో పెళ్లైంది. వీరికి శిరీష (14), సందీప్ (12) సంతానం. జీవనోపాధి కోసం  2005లో నగరానికి వచ్చారు. ప్రగతినగర్‌లో నివాసముంటూ గణేష్ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వరలక్ష్మికి కొన్ని రోజుల క్రితం కాకినాడకు చెందిన వెంకటేష్‌తో పరి చయం ఏర్పడింది.


గత నవంబర్‌లో లక్ష్మి కాకినాడకు వెళ్లి అక్కడే ఉండిపోయింది. ఈ నెల 20న తిరిగి ప్రగతినగర్‌లోని తన భర్త వద్దకు వచ్చింది.  మంగళవారం అర్దరాత్రి తిరిగి కాకినాడ వెళ్తానని భర్తతో అనడం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన గణేష్ భార్యను ఇంట్లో నుంచి జుట్టు పట్టుకుని బయటకు లాక్కొచ్చి.. ఇంటి ముందు ఉన్న సీసీ రోడ్డుకు తలను బలంగా కొట్టాడు. అంతటితో ఆగకకుండా పక్కనే ఉన్న బండరాయితో వరలక్ష్మి తలపై మోది హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. నిందితుడు గణేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement