సుజాత కేసులో పురోగతి | sujatha suicide case; owner arrest | Sakshi
Sakshi News home page

సుజాత కేసులో పురోగతి

Nov 8 2016 1:19 PM | Updated on Sep 4 2017 7:33 PM

సుజాత కేసులో పురోగతి

సుజాత కేసులో పురోగతి

సుజాత ఆత్మహత్య కేసులో నిందితులను అరెస్ట్ చేశారు.

హైదరాబాద్: కూకట్పల్లిలో ఇంటి ఓనర్ వేధింపుల కారణంగా సుజాత ఆత్మహత్య చేసుకున్న కేసులో నిందితులను అరెస్ట్ చేశారు. సుజాత అద్దెకు ఉన్న ఇంటి యజమాని ప్రస‍న్న కుమార్ రెడ్డి, స్నేహలత దంపతులపై కూకట్పల్లి పోలీసులు 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మంగళవారం వారిద్దరిని మియాపూర్ కోర్టులో హాజరుపరిచారు.

ఇంటి ఓనర్ తనను తీవ్రంగా వేధించాడని ఇంట్లో పలు చోట్ల రాసి సోమవారం సుజాత ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయం తెలియగానే ఇంటి ఓనర్ ప్రసన్న కుమార్ రెడ్డి పరారయ్యాడు. ఈ ఇంటిలో రెండున్నరేళ్లుగా సుజాత దంపతులు అద్దెకు ఉంటున్నారు. సుజాత పిల్లలు అల్లరి చేస్తున్నారని కొంతకాలంగా ఓనర్ గొడవ పడినట్టు తెలుస్తోంది. సుజాత భర్త ఇంట్లో లేని సమయంలో ఓనర్ ఆమెతో గొడవపడి, అసభ్యంగా మాట్లాడాడని బంధువులు చెప్పారు. సుజాత మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుందని తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement